IND vs AUS: స్వదేశంలో ఉమేష్ యాదవ్ అరుదైన రికార్డు
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా వెటరన్ పేసర్ ఉమేష్ యాదవ్ సంచలన రికార్డును సృష్టించాడు. స్వదేశంలో ఆడిన టెస్టులో 100 వికెట్లు పూర్తి చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. ఈ మైలురాయిని అందుకున్న ఐదో టీమిండియా ఆటగాడిగా చరిత్రకెక్కాడు. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ 197 పరుగలకు అలౌటైంది. ఈ మ్యాచ్‌లో ఉమేష్ యాదవ్ మూడు కీలక వికెట్లను పడగొట్టి ఈ ఘనతను సాధించాడు. ఇండోర్‌లో జరుగుతున్న టెస్టు తొలి రెండు ఇన్నింగ్స్‌ల్లో యాదవ్, రవిచంద్రన్ అశ్విన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కేవలం 11 పరుగుల వ్యవధిలో ఆరు వికెట్లను తీసి భారత్‌కు శుభారంభాన్ని అందించారు.
150 వికెట్లు తీసిన ఆరో బౌలర్‌గా యాదవ్
యాదవ్ స్వదేశంలో 31 మ్యాచ్‌ల్లో 24.53 సగటుతో 100 వికెట్లు పూర్తి చేశాడు. కపిల్ దేవ్ (209), జవగల్ శ్రీనాథ్ (108), జహీర్ ఖాన్ (104), ఇషాంత్ శర్మ (104) వికెట్లు తీసి యాదవ్ కంటే ముందు స్థానంలో ఉన్నారు. యాదవ్ ఇప్పటి వరకు భారత్ తరఫున మొత్తం 55 టెస్టులు ఆడాడు. అతను 29.74 సగటుతో 168 వికెట్లు తీశాడు, ఇందులో 3 సార్లు ఐదు వికెట్లు తీశాడు. టెస్టుల్లో 150కి పైగా వికెట్లు తీసిన టీమిండియా ఆరో బౌలర్‌గా యాదవ్ నిలిచాడు. ఇండోర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మాథ్యూ కుహ్నెమాన్ ఐదు వికెట్లు తీయడంతో భారత్ 109 పరుగులకే ఆలౌటైంది.