LOADING...
AUS vs IND: ఆస్ట్రేలియా, భారత్ మధ్య నాలుగో టెస్టు.. టికెట్లకు ఫుల్ డిమాండ్
ఆస్ట్రేలియా, భారత్ మధ్య నాలుగో టెస్టు.. టికెట్లకు ఫుల్ డిమాండ్

AUS vs IND: ఆస్ట్రేలియా, భారత్ మధ్య నాలుగో టెస్టు.. టికెట్లకు ఫుల్ డిమాండ్

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 10, 2024
03:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy) సిరీస్ అత్యంత ఉత్కంఠగా కొనసాగుతోంది. తొలి టెస్టులో టీమిండియా (Team India) పెర్త్‌లో ఘన విజయం సాధించగా, అడిలైడ్ టెస్టులో ఆస్ట్రేలియా (Australia) జట్టు గెలిచింది. దీంతో ఐదు టెస్టుల సిరీస్ 1-1తో సమమైంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌ (WTC Final) చేరుకోవడం కోసం ఇరుజట్లకు ఈ సిరీస్ కీలకంగా మారింది. ఈ కారణంగా, మిగిలిన మ్యాచ్‌లు మరింత ఆసక్తికరంగా సాగుతాయని ఊహించవచ్చు. అభిమానుల్లో కూడా ఈ సిరీస్‌పై ఆసక్తి పెరిగింది. డిసెంబర్ 26న మెల్‌బోర్న్‌ వేదికగా బాక్సింగ్‌ డే టెస్టు (Boxing Day Test) ప్రారంభం కానుండగా, ఈ మ్యాచ్ టికెట్లకు పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడింది.

వివరాలు 

పింక్ బాల్ టెస్టుకు భారీ సంఖ్యలో ప్రేక్షకులు 

లక్ష మంది సామర్థ్యం ఉన్న ఈ స్టేడియంలో మొదటి రోజు ఆటకు సంబంధించిన పబ్లిక్ టికెట్లు ఇప్పటికే అమ్ముడవగా, క్రికెట్ ఆస్ట్రేలియా ఈ విషయాన్ని ఎక్స్‌ (ట్విటర్‌)లో వెల్లడించింది. అదే సమయంలో, అడిలైడ్‌లో జరిగిన పింక్ బాల్ టెస్టుకు కూడా ప్రేక్షకులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. మూడురోజుల్లో 1,35,012 మంది అభిమానులు స్టేడియానికి వచ్చారు. తొలి రోజు 50,186 మంది, రెండో రోజు 51,542 మంది ఉండటం రికార్డు స్థాయి హాజరుగా నిలిచింది. ఇక, బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో మూడో టెస్టు డిసెంబర్ 14న బ్రిస్బేన్‌లో గబ్బా స్టేడియంలో ప్రారంభం కానుంది.