
Virat Kohli: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అరుదైన రికార్డుకు చేరువలో కోహ్లీ.. 21 పరుగులు చేస్తే చాలు!
ఈ వార్తాకథనం ఏంటి
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నవంబర్ 22 నుండి మొదలుకానుంది.
మొదటి టెస్ట్ మ్యాచ్ పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ ఓ ప్రత్యేకమైన మైలురాయికి చేరుకొనే అవకాశం ఉంది.
కోహ్లీ పెర్త్ మైదానంలో అనేక రికార్డులున్నాయి. కానీ ప్రస్తుతం టెస్ట్ క్రికెట్‌లో కొంత ఫామ్ కోల్పోయిన కోహ్లీ ఈ సిరీస్‌లో తిరిగి రాణించాలని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవలే అనేక రికార్డులు సాధించిన కోహ్లీ, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కేవలం 21 పరుగులు చేస్తే 2వేల పరుగుల మైలురాయిని చేరుకుంటాడు.
Details
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఎనిమిది సెంచరీలు చేసిన కోహ్లీ
ఈ ట్రోఫీలో 2,000 పరుగులు చేసిన ఏడవ బ్యాటర్‌గా కోహ్లీ చరిత్ర సృష్టించనున్నారు. ఇప్పటివరకు 24 టెస్టుల్లో 42 ఇన్నింగ్స్‌లతో 1979 పరుగులు చేసిన కోహ్లీ, 8 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు సాధించాడు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితా
1.సచిన్ టెండూల్కర్ - 3,262 పరుగులు
2. రికీ పాంటింగ్ - 2,555 పరుగులు
3. వీవీఎస్ లక్ష్మణ్ - 2,434 పరుగులు
4. రాహుల్ ద్రావిడ్ - 2,143 పరుగులు
5. మైఖేల్ క్లార్క్ - 2,049 పరుగులు
6. చెతేశ్వర్ పుజారా - 2,033 పరుగులు
7. విరాట్ కోహ్లీ - 1,979 పరుగులు