Page Loader
IND Vs AUS: పెర్త్‌లో భారత్-ఆస్ట్రేలియా మొదటి టెస్ట్.. మ్యాచ్ సమయం, సెషన్స్ వివరాలు
పెర్త్‌లో భారత్-ఆస్ట్రేలియా మొదటి టెస్ట్.. మ్యాచ్ సమయం, సెషన్స్ వివరాలు

IND Vs AUS: పెర్త్‌లో భారత్-ఆస్ట్రేలియా మొదటి టెస్ట్.. మ్యాచ్ సమయం, సెషన్స్ వివరాలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 19, 2024
12:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

2024 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్లు ఐదు టెస్టు మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఈ సిరీస్‌లో మొదటి టెస్ట్ 22వ తేదీ నుండి పెర్త్‌లో ప్రారంభం కానుంది. ఇప్పటికే టీమిండియా ఆటగాళ్లు పెర్త్‌ చేరుకుని, ప్రాక్టీస్ సెస్‌షన్స్‌లో మునిగిపోయారు. గతంలో స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టుల్లోనూ భారత్ జట్టు ఓడిపోయింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో జరిగే తొలి టెస్టులో విజయం సాధించాలని టీమిండియా గట్టి పట్టుదలతో ఉంది. ప్రస్తుతం డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకోవాలంటే, భారత్ జట్టుకు ఆస్ట్రేలియా చేతిలో నాలుగు టెస్టుల్లో విజయం సాధించాల్సి ఉంది. అందువల్ల పెర్త్‌లో జరగనున్న మొదటి టెస్టు ద్వారా సిరీస్‌ ప్రారంభాన్ని విజయం సాధించాలనే లక్ష్యంతో భారత్ ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్నారు.

Details

22న తొలి టెస్టు

ఆస్ట్రేలియా-టీమిండియా ఐదు టెస్టుల సిరీస్‌లో తొలి టెస్ట్ పెర్త్ వేదికగా ఈనెల 22న ప్రారంభమవుతుంది. ఈ టెస్టు ఉదయం 7.50 నుండి మధ్యాహ్నం 2.50 గంటల వరకు జరుగుతుంది. మ్యాచ్ సెషన్ల సమయాలు మొదటి సెషన్ : ఉదయం 7.50 నుండి 9.50 వరకు రెండో సెషన్ : 10.30 నుండి మధ్యాహ్నం 12.30 వరకు మూడో సెషన్ : మధ్యాహ్నం 12.50 నుండి 2.50 గంటల వరకు