Page Loader
AUS vs IND: బాక్సింగ్‌ డే టెస్టుకు ఆసీస్‌ తుది జట్టు ప్రకటన.. సామ్ కాన్ట్సాస్ అరంగేట్రం
బాక్సింగ్‌ డే టెస్టుకు ఆసీస్‌ తుది జట్టు ప్రకటన.. సామ్ కాన్ట్సాస్ అరంగేట్రం

AUS vs IND: బాక్సింగ్‌ డే టెస్టుకు ఆసీస్‌ తుది జట్టు ప్రకటన.. సామ్ కాన్ట్సాస్ అరంగేట్రం

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 25, 2024
09:11 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్టు గురువారం ప్రారంభం కానుంది. బాక్సింగ్‌ డే టెస్టుగా పిలిచే ఈ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా తన తుది జట్టును ప్రకటించింది. యువ ఆటగాడు సామ్ కాన్ట్సాస్‌కు చోటు కల్పించింది. డేంజరస్‌ బ్యాటర్ ట్రావిస్ హెడ్ ఫిట్‌నెస్‌పై ఉన్న అనుమానాలు తొలగిపోయాయి. ఫిట్‌నెస్‌ టెస్టులో పాస్ కావడంతో అతడిని తుది జట్టులో చేర్చారు. గబ్బా మ్యాచ్‌ జట్టుతో పోల్చితే రెండు మార్పులు చేయాలని ఆస్ట్రేలియా మేనేజ్‌మెంట్ నిర్ణయించింది. నాథన్ మెక్‌స్వీనీ స్థానంలో 19 ఏళ్ల సామ్ కాన్ట్సాస్‌కు అవకాశం ఇవ్వగా, గాయంతో సిరీస్‌కు దూరమైన జోష్ హేజిల్‌వుడ్ స్థానంలో స్కాట్ బొలాండ్ మూడో ప్రధాన పేసర్‌గా జట్టులో చేరాడు.

Details

ఖవాజా - కాన్ట్సాస్‌ అరుదైన ఘనత

బాక్సింగ్‌ డే టెస్టులో ఆస్ట్రేలియా తరఫున ఉస్మాన్ ఖవాజా - సామ్ కాన్ట్సాస్ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తారు. ఈ ద్వయం ఓ అరుదైన రికార్డును తమ ఖాతాలో వేసుకోనుంది. 38 ఏళ్ల ఖవాజా, 19 ఏళ్ల కాన్ట్సాస్ కలిసి అత్యధిక వయస్సు వ్యత్యాసం ఉన్న తొలి ఓపెనింగ్ జోడీగా రికార్డు సృష్టించబోతోంది. మెక్‌స్వీనీ నిరాశజనక ప్రదర్శన కారణంగా కాన్ట్సాస్‌ను ఎంపిక చేశారు. భారత్‌తో పింక్‌బాల్ వార్మప్‌ మ్యాచ్‌లో ప్రైమ్‌మినిస్టర్స్‌ XI తరఫున కాన్ట్సాస్ 97 బంతుల్లో 107 పరుగులు సాధించి, సిరాజ్‌, జడేజా వంటి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు.

Details

ఆసీస్ జట్టు ఇదే

ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్ట్సాస్, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కేరీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లైయన్, స్కాట్ బొలాండ్.