LOADING...
T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా.. స్టార్ ప్లేయర్స్ దూరం
టీ20 ప్రపంచకప్ జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా.. స్టార్ ప్లేయర్స్ దూరం

T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా.. స్టార్ ప్లేయర్స్ దూరం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 31, 2026
01:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీ20 ప్రపంచకప్‌ 2026 (T20 World Cup 2026) టోర్నమెంట్‌కు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా కీలక ప్రకటన చేసింది. ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొనే 15 మంది సభ్యులతో కూడిన ఆస్ట్రేలియా జట్టును అధికారికంగా ప్రకటించింది. మిచెల్ మార్ష్ కెప్టెన్‌గా కొనసాగనున్న ఈ జట్టులో కొన్ని కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ టోర్నమెంట్‌కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు ఊహించని షాక్ తగిలింది. డేంజరస్ ఫాస్ట్ బౌలర్లు ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ ఇద్దరూ టీ20 ప్రపంచ కప్‌ 2026కు దూరమయ్యారు. ముఖ్యంగా కెప్టెన్‌, స్టార్ పేసర్ అయిన ప్యాట్ కమిన్స్‌ను జట్టు నుంచి తప్పించడమే కాకుండా, గాయంతో బాధపడుతున్న కారణంగా అతనికి విశ్రాంతి ఇవ్వాలని క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయించింది.

Details

పాట్ కమిన్స్ దూరం

ఇటీవల ప్యాట్ కమిన్స్‌కు గాయం కావడంతో ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఈ పరిస్థితుల్లో అతన్ని రిస్క్ చేయడం ఇష్టం లేక, ప్రపంచ కప్‌ నుంచి తప్పించినట్లు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. కమిన్స్ స్థానంలో బెన్ డ్వార్షుయిస్‌ను జట్టులోకి తీసుకున్నట్లు అధికారికంగా వెల్లడించింది. మరోవైపు మిచెల్ మార్ష్ సారథ్యంలో ఆస్ట్రేలియా జట్టు ఈసారి కూడా ట్రోఫీపై కన్నేసింది. బ్యాటింగ్, ఆల్‌రౌండింగ్ విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న ఆసీస్ జట్టు, కమిన్స్, స్టార్క్ లాంటి అనుభవజ్ఞుల లేమిని ఎలా భర్తీ చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

Details

2026 టీ20 ప్రపంచ కప్‌కు ఆస్ట్రేలియా జట్టు

మిచెల్ మార్ష్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, జోష్ హేజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, జేవియర్ బార్ట్‌లెట్, మ్యాట్ కొన్నోల్లీ టిమ్ డేవిడ్, బెన్ డ్వార్షుయిస్, కామెరూన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా. టీ20 ప్రపంచ కప్‌ 2026లో ఈ జట్టు ఎలాంటి ప్రదర్శన చేస్తుందన్నది క్రికెట్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Advertisement