Loading...
AUS vs BAN: బంగ్లాపై ఇన్నింగ్స్‌ తేడాతో విజయం.. ప్రతీకారం తీర్చుకున్న ఆసీస్
బంగ్లాపై ఇన్నింగ్స్‌ తేడాతో విజయం.. ప్రతీకారం తీర్చుకున్న ఆసీస్

AUS vs BAN: బంగ్లాపై ఇన్నింగ్స్‌ తేడాతో విజయం.. ప్రతీకారం తీర్చుకున్న ఆసీస్

వ్రాసిన వారు Moogati Shabari
Aug 23, 2026
12:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

గాయపడిన సింహంలా ఆస్ట్రేలియా (AUS vs BAN) బంగ్లాదేశ్‌పై విరుచుకుపడింది. సొంతగడ్డపై ఎదురైన ఘోర పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. తమను తక్కువ అంచనా వేస్తే ఎలా ఉంటుందో బంగ్లాకు మరోసారి రుచి చూపించింది. తొలి టెస్టులో సంచలన విజయం సాధించిన బంగ్లాదేశ్‌కు రెండో టెస్టులో అసలైన సవాల్‌ ఏంటో చూపించింది. రెండో మ్యాచ్‌లో ఏకంగా ఇన్నింగ్స్‌ 51 పరుగుల తేడాతో బంగ్లాను చిత్తుగా ఓడించింది. తక్కువ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌ కేవలం రెండో రోజు రెండో సెషన్‌ తొలి ఓవర్‌లోనే ముగియడం విశేషం.

వివరాలు

51పరుగుల తేడాతో ఘన విజయం..

బౌలర్లు ఆధిపత్యం ప్రదర్శించిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పూర్తి పట్టు సాధించింది.

తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ను కేవలం 64 పరుగులకే ఆలౌట్ చేసిన ఆసీస్‌.. రెండో ఇన్నింగ్స్‌లోనూ పదునైన బౌలింగ్‌తో ఆ జట్టును 95 పరుగులకే కుప్పకూల్చింది.

మిచెల్‌ స్టార్క్‌ మరోసారి చెలరేగి బంగ్లా పతనంలో కీలక పాత్ర పోషించాడు.

అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 210 పరుగులు చేసింది.

బంగ్లాదేశ్‌పై ఇన్నింగ్స్‌ 51పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్‌ మొత్తం 10 వికెట్లు పడగొట్టాడు.

కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ ఆరు వికెట్లు తీసుకున్నాడు. నాథన్‌ లయన్‌ మూడు వికెట్లు, జోష్‌ హేజిల్‌వుడ్‌ ఒక వికెట్‌ పడగొట్టారు.

వివరాలు

విలువైన పరుగులు..

రెండో రోజు 165/8 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఆటను కొనసాగించిన ఆస్ట్రేలియాకు కామెరూన్‌ గ్రీన్‌ (67), నాథన్‌ లయన్‌ (32*) విలువైన పరుగులు జోడించారు.

తొమ్మిదో వికెట్‌కు వీరిద్దరూ 38 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. గ్రీన్‌ ఔటైన తర్వాత కూడా లయన్‌ వెనక్కి తగ్గలేదు.

జోష్‌ హేజిల్‌వుడ్‌ (6)తో కలిసి పదో వికెట్‌కు మరో 24 పరుగులు జోడించాడు.

దీంతో ఆస్ట్రేలియా 210 పరుగులకు చేరుకుంది. బంగ్లాదేశ్‌ బౌలర్లలో షోరిఫుల్‌ ఇస్లామ్‌ ఏడు వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు.

తస్కిన్‌ అహ్మద్‌, తైజుల్‌ ఇస్లామ్‌, మెహిదీ హసన్‌ మిరాజ్‌ తలో వికెట్‌ తీసుకున్నారు.

ADVERTISEMENT