
Aus vs SA: 54 ఏళ్ల వన్డే చరిత్రలోనే చెత్త రికార్డ్ సృష్టించిన ఆస్ట్రేలియా
ఈ వార్తాకథనం ఏంటి
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో దక్షిణాఫ్రికా ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఇప్పటికే తొలి మ్యాచ్‌లో 98 పరుగుల తేడాతో విజయం సాధించిన దక్షిణాఫ్రికా, రెండో వన్డేలో కూడా 84 పరుగుల తేడాతో గెలిచి 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ వరుస ఓటములు ఆస్ట్రేలియా జట్టుకు చెత్త రికార్డుగా మిగిలిపోయాయి. 54 ఏళ్ల వన్డే చరిత్రలో తొలిసారిగా ఆసీస్ జట్టు ఇంత దారుణ ప్రదర్శన కనబరుస్తోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే—ఆటలోని గత నాలుగు వన్డేలలో వరుసగా 200 పరుగులు కూడా దాటలేకపోవడం. అది కూడా తమ సొంతగడ్డపై ఆడిన మ్యాచ్‌ల్లోనే జరగడం గమనార్హం. ఆస్ట్రేలియా తమ స్వదేశంలో ఆడిన నాలుగు వరుస వన్డేలలో ఒకసారి కూడా 200 పరుగులు చేయలేకపోయింది.
Details
200 పరుగులకే ఆలౌట్
వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో 200లోపే ఆలౌట్ కావడం వన్డే చరిత్రలో తొలిసారి చోటుచేసుకుంది. పాకిస్తాన్, దక్షిణాఫ్రికా జట్లు ఆస్ట్రేలియాను ఈ చెత్త రికార్డుకు గురిచేశాయి. ఇటీవల ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో కోల్పోయింది. ఆ సిరీస్‌లో రెండో వన్డేలో ఆసీస్ 163 పరుగులకే ఆలౌట్ కాగా, మూడో వన్డేలో కేవలం 140 పరుగులు మాత్రమే చేసింది. తరువాతి సిరీస్‌లో దక్షిణాఫ్రికాను ఎదుర్కొన్న ఆస్ట్రేలియా తొలి వన్డేలో 198 పరుగులు మాత్రమే చేయగలిగింది. రెండో వన్డేలో 193 పరుగులకే కుప్పకూలింది. దీంతో వన్డే క్రికెట్ చరిత్రలో తొలిసారిగా స్వదేశంలో ఆస్ట్రేలియా వరుసగా నాలుగు మ్యాచ్‌లలో 200 పరుగులలోపే ఆలౌట్ అయ్యింది.