LOADING...
David Warner: షాకింగ్.. ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ అరెస్ట్
షాకింగ్.. ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ అరెస్ట్

David Warner: షాకింగ్.. ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ అరెస్ట్

వ్రాసిన వారు Moogati Shabari
Apr 07, 2026
05:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మద్యం సేవించి వాహనం నడిపిన ఆరోపణలతో సిడ్నీ నగరంలో మంగళవారం అతనిపై చర్యలు తీసుకున్నారని ఆస్ట్రేలియా మీడియా నివేదికలు తెలిపాయి. రోడ్డుపై నిర్వహిస్తున్న బ్రీత్ టెస్టింగ్‌ను గమనించిన వార్నర్ తన కారును ఆపి పక్కకు నిలిపాడు. అయితే అనుమానం కలిగిన పోలీసులు బ్రీత్ అనలైజర్‌తో పరీక్షించగా, అతను అనుమతించిన పరిమితిని మించి మద్యం సేవించినట్లు నిర్ధారించబడింది. దీంతో అతడిని అరెస్టు చేసినట్లు నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి.

వివరాలు

బెయిల్‌పై విడుదల..

అరెస్ట్ తరువాత డేవిడ్ వార్నర్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించి బెయిల్‌పై విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి వచ్చే నెలలో వార్నర్ కోర్టులో హాజరుకావాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా, ప్రస్తుతం వార్నర్ పాకిస్థాన్ క్రికెట్ లీగ్‌లో పాల్గొంటున్నాడు. కరాచీ కింగ్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అతను, ఇటీవల వ్యక్తిగత కారణాలతో సెలవు తీసుకుని ఆస్ట్రేలియాకు వెళ్లాడు. ఈ లీగ్ అయిపోగానే త్వరలోనే మళ్లీ పాకిస్థాన్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

Advertisement