
AUS vs SA: ఆస్ట్రేలియా బ్యాటర్ల విధ్వంసం.. ముగ్గురు సెంచరీలు.. దక్షిణాఫ్రికా టార్గెట్ 431
ఈ వార్తాకథనం ఏంటి
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న 3 వన్డేల సిరీస్‌లో సౌత్ ఆఫ్రికా మొదటి రెండు మ్యాచ్‌లను గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకుంది. అయితే, సిరీస్‌లో నామమాత్రపు మూడో వన్డేలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌లు అద్భుత ప్రదర్శనతో జట్టుకు భారీ స్కోరు సమర్పించారు. మాకే స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుని 50 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి 431 పరుగులు నమోదు చేసింది. ఒకే ఇన్నింగ్స్‌లో మూడు శతకాలు రావడం ఈ మ్యాచ్ ప్రత్యేకత.
Details
55 బంతుల్లోనే గ్రీన్ సెంచరీ
ఇన్నింగ్స్ ప్రారంభంలో ట్రావిస్ హెడ్ స్టన్నింగ్ ప్రదర్శన చూపించాడు. 103 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్స్‌లతో 142 పరుగులు చేసి జట్టుకు బలమైన పునాది వేసాడు. కెప్టెన్ మిచెల్ మార్ష్ జాగ్రత్తగా ఆడుతూ 106 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేశాడు. ఆ తర్వాత కామెరాన్ గ్రీన్ క్రమం తప్పకుండా విధ్వంసం సృష్టించాడు. 55 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్స్‌లతో 118 పరుగులు చేశాడు. అతనికి తోడుగా అలెక్స్ కేరీ కూడా వేగంగా 37 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసి జట్టుకు సహకరించాడు.