టీ20ల్లో ఆస్ట్రేలియా క్రీడాకారిణి మేగాన్ షట్ అద్భుత రికార్డు
పాకిస్థాన్ మహిళలతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20ల తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పేసర్ మేగాన్ షుట్ అద్భుత రికార్డును సాధించింది. మంగళవారం 5/15తో రాణించి కెరీయర్లో అద్భుతమైన రికార్డులను నమోదు చేసింది. దీంతో పాకిస్తాన్ 118 పరుగులకే ఆలౌటైంది. చివరికి ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో సంచలన విజయాన్ని నమోదు చేసింది. బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ 6.2 ఓవర్లలో 32 పరుగులు చేసి 4 వికెట్లను కోల్పోయింది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు ఒమైమా సొహైల్ (30), అయేషా నసీమ్ (24) మాత్రమే రాణించారు. ఆల్ రౌండర్ ఎల్లీస్ పెర్రీ, అలనా కింగ్‌లు తలో రెండు వికెట్లు పడగొట్టారు.
మేగాన్ షట్ సాధించిన రికార్డులివే..
మోలీ స్ట్రానో (5/10), జెస్ జోనాస్సెన్ (5/12) తర్వాత మేగాన్ షట్ ప్రస్తుతం టీ20ల్లో 5/15తో రాణించి రికార్డుకెక్కింది. టీ20ల్లో ఆరుదైన ఘనత సాధించిన నాలుగో ఆస్ట్రేలియా బౌలర్‌గా ఆమె రికార్డు సృష్టించారు. 2013లో అరంగేట్రం చేసి మేగాన్ షట్ 89 మ్యాచ్ లు ఆడి 16.25 సగటుతో 114 వికెట్లు పడగొట్టింది. ఉమెన్స్ టీ20ల్లో అత్యధిక వికెట్లు సాధించిన నాల్గవ క్రీడాకారిణిగా అమె పేరు నమోదు చేసింది. 2020 ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసింది. ఆమె 10.31 సగటుతో 13 వికెట్లు పడగొట్టి, సత్తా చాటింది. 2022లో బర్మింగ్‌హామ్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో ఆమె 13.50 సగటుతో ఎనిమిది వికెట్లు తీసింది.