Page Loader
ఆస్ట్రేలియా క్రికెట్ అవార్డులు-2023.. విజేతలు వీరే..
నాలుగోసారి అలన్ బోర్డర్ పతకాన్ని అందుకున్న స్టీవ్ స్మిత్

ఆస్ట్రేలియా క్రికెట్ అవార్డులు-2023.. విజేతలు వీరే..

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 31, 2023
11:54 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్ట్రేలియా తమ దేశానికి చెందిన మెన్, ఉమెన్ క్రికెట్ ప్లేయర్లకు అవార్డులకు ప్రకటించింది. ఆస్ట్రేలియన్ క్రికెట్ అవార్డ్స్ 2023లో భాగంగా ఆసీస్‌ రన్ మెషిన్ స్టీవ్ స్మిత్ అలెన్ బోర్డర్ మెడల్‌ను కైవసం చేసుకున్నాడు. ఉమెన్ ప్లేయర్ బెత్ మూనీ బెలిండా క్లార్క్ అవార్డును సొంతం చేసుకుంది. ఏడాది పొడవునా ప్రతి మ్యాచ్ నుండి 3-2-1 ప్రాతిపదికన ఆటగాళ్లు, అంపైర్లు, మీడియా ప్రతినిధుల ఓట్ల ద్వారా ప్రతి ఫార్మాట్‌కు అగ్ర అవార్డులు ప్రధానం చేయడం అనవాయితీగా వస్తోంది. ట్రావిస్ హెడ్ (144 ఓట్లు), డేవిడ్ వార్నర్ (141) కంటే 171 ఓట్లతో స్మిత్ మెరుగైన స్థానంలో నిలిచాడు. వరుసగా 2015, 2018, 2021 సంవత్సరాల్లో కూడా ఈ అవార్డును స్మిత్ గెలుచుకున్నాడు.

ఆస్ట్రేలియా

మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఉస్మాన్ ఖవాజా

మహిళా వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా ఎంపికైన మూనీ 129 ఓట్లతో కెప్టెన్ మెగ్ లానింగ్ (110)ను ఓడించింది. ఓటింగ్ వ్యవధి గత జనవరిలో జరిగిన బహుళ-ఫార్మాట్ యాషెస్, ICC మహిళల ప్రపంచ కప్, ఐర్లాండ్, పాకిస్తాన్‌లతో జరిగిన T20 ట్రై-సిరీస్, కామన్వెల్త్ గేమ్స్‌, పాకిస్తాన్‌తో జరిగిన వన్డేలను పరిగణనలోకి తీసుకుంది. ఉస్మాన్ ఖవాజా మెన్స్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికయ్యారు. మార్కర్ స్టోనియిస్, తాలియా మెక్‌గ్రాత్‌కు మెన్స్ అండ్ టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు లభించాయి.