Page Loader
Australian Open: చరిత్ర సృష్టించిన రోహన్ బోపన్న.. 43 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను కైవసం
Australian Open: చరిత్ర సృష్టించిన రోహన్ బోపన్న.. 43 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను కైవసం

Australian Open: చరిత్ర సృష్టించిన రోహన్ బోపన్న.. 43 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను కైవసం

వ్రాసిన వారు Stalin
Jan 27, 2024
09:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత వెటరన్ రోహన్ బోపన్న, అతని ఆస్ట్రేలియన్ భాగస్వామి మాథ్యూ ఎబ్డెన్ 'ఆస్ట్రేలియన్ ఓపెన్‌-2024' టైటిల్ పోరులో చరిత్ర సృష్టించారు. బోపన్న-ఎబ్డెన్ జోడీ.. ఇటాలియన్ జోడీ సిమోన్ బోలెల్లి, ఆండ్రియా వవస్సోరిలను 7-6(7-0), 7-5తో ఓడించారు. దీంతో 43ఏళ్ల బోపన్న తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ గెలుచుకోవడంలో సఫలమయ్యాడు. ఈ వయసులో ఆస్ట్రేలియన్ ఓపెన్‌ గెలిచిన తొలి ఆటగాడిగా బోపన్న రికార్డు సృష్టించారు. ఫైనల్ మ్యాచ్‌లో బోపన్న, ఎబ్డెన్‌ల జోడీ సులభంగా వరుస సెట్లలో విజయం సాధించాడు. బోపన్న రెండోసారి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. అంతకుముందు 2017లో కెనడాకు చెందిన గాబ్రియేలా డబ్రోవ్‌స్కీతో కలిసి ఫ్రెంచ్ ఓపెన్‌లో మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను గెలుచుకున్నారు.

 ఆస్ట్రేలియన్ ఓపెన్‌ 

ఈ రికార్డు కూడా బోపన్న పేరిటే 

ప్రపంచ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో బోపన్న అగ్రస్థానంలో ఉన్నాడు. 43 ఏళ్ల బోపన్న పురుషుల డబుల్స్ టెన్నిస్ చరిత్రలో ప్రపంచ నంబర్-1గా నిలిచిన ఏకైక ఆటగాడు బోపన్న. అతను లియాండర్ పేస్, మహేశ్ భూపతి, సానియా మీర్జా తర్వాత టెన్నిస్ డబుల్స్‌లో ప్రపంచ నంబర్-1 ర్యాంక్ సాధించిన నాలుగో భారతీయ ఆటగాడిగా నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు అమెరికాకు చెందిన రాజీవ్ రామ్ పేరిట ఉండేది. అతను అక్టోబర్ 2022 లో 38 సంవత్సరాల వయస్సులో మొదటి స్థానానికి చేరుకున్నాడు. గతేడాది యూఎస్ ఓపెన్‌లో బోపన్న ఫైనల్స్‌కు చేరుకున్నాడు. అక్కడ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈ భారత వెటరన్ గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలవడం ఇదే తొలిసారి.