తదుపరి వార్తా కథనం
Steve Smith: టీమిండియాతో ఓటమి.. రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా స్టార్ స్టీవ్ స్మిత్
వ్రాసిన వారు
Jayachandra Akuri
Mar 05, 2025
12:34 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవన్ స్మిత్ క్రికెట్ ప్రేమికులకు షాక్ ఇచ్చాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
వన్డే ఫార్మాట్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు ఈ రోజు (మార్చి 5) అధికారికంగా ప్రకటించాడు. మంగళవారం ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీఫైనల్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓటమి పాలైంది.
ఈ పోరులో ఓడిపోయిన అనంతరం స్టీవ్ స్మిత్ అనూహ్యంగా వన్డేలకు గుడ్‌బై చెప్పేశాడు. ఈ టోర్నీలో ప్యాట్ కమిన్స్ గైర్హాజరైన నేపథ్యంలో ఆస్ట్రేలియాకు స్మిత్ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహించాడు.
తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించిన స్మిత్, వన్డే ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్తున్నప్పటికీ, టెస్టులు, టీ20ల్లో మాత్రం ఆసీస్ తరఫున ఆడుతానని స్పష్టం చేశాడు. స్మిత్ నిర్ణయంతో అభిమానులు ఆశ్చర్యానికి గురి చేసింది.