Axar Patel: అక్షర్ పటేల్ సీఎస్‌కేకు.. ఢిల్లీతో భారీ ట్రేడ్‌కు రంగం సిద్ధం?
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2027కు ముందు మరో భారీ ట్రేడ్‌కు రంగం సిద్ధమవుతోందా? ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను ట్రేడింగ్ విండో ద్వారా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) దక్కించుకునే అవకాశం ఉందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. మినీ వేలానికి ముందు ఈ ట్రేడ్ వార్తలు ఐపీఎల్ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి.
వివరాలు
అక్షర్‌ను వదులుకోవడం ఢిల్లీకి నష్టమే: అశ్విన్
ఈ ట్రేడ్ ఊహాగానాలపై భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందిస్తూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అక్షర్ పటేల్‌ను వదులుకోవడం ఢిల్లీ క్యాపిటల్స్‌కు తీరని నష్టమని అభిప్రాయపడ్డాడు.
'నాలుగు ఓవర్ల కోటాను సమర్థంగా పూర్తి చేయగల నాణ్యమైన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్‌తో పాటు, మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయగల ఆల్‌రౌండర్లు ఐపీఎల్‌లో చాలా అరుదు.
అలాంటి విలువైన ఆటగాడిని ఢిల్లీ వదులుకోదని నేను భావిస్తున్నానని అశ్విన్ పేర్కొన్నాడు. ఇప్పటికే రిషభ్ పంత్ ట్రేడ్ డీల్‌లో భాగంగా కుల్దీప్ యాదవ్ లక్నో సూపర్ జెయింట్స్‌కు వెళ్లారనే ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో అక్షర్ కూడా జట్టును వీడితే ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్ విభాగం మరింత బలహీనపడుతుందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.
వివరాలు
పంత్‌కు మళ్లీ కెప్టెన్సీ ఇవ్వొద్దా?
ఒకవేళ అక్షర్ పటేల్ ట్రేడ్ వాస్తవరూపం దాలిస్తే ఢిల్లీ క్యాపిటల్స్‌కు కొత్త కెప్టెన్ అవసరం ఏర్పడుతుంది. గతంలో రిషభ్ పంత్ జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహించాడు.
అయితే మళ్లీ అతడికే ఆ బాధ్యతలు అప్పగిస్తే బ్యాటింగ్‌పై ప్రభావం పడవచ్చని అశ్విన్ విశ్లేషించాడు.
పంత్‌పై ఒత్తిడి తగ్గించేందుకు అనుభవజ్ఞుడైన కేఎల్ రాహుల్‌ను కెప్టెన్‌గా నియమించడం మంచిదని సూచించాడు.
వివరాలు
సీఎస్‌కే నుంచి ఆ ఇద్దరిలో ఒకరు?
మరోవైపు, ఈ ట్రేడ్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ తమ ఆటగాళ్లు డెవాల్డ్ బ్రెవిస్ లేదా నూర్ అహ్మద్‌లలో ఒకరిని ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇచ్చే అవకాశం ఉందనే అంచనాలు వినిపిస్తున్నాయి.
అయితే అక్షర్ పటేల్ ట్రేడ్‌కు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ప్రస్తుతం ఈ వార్తలన్నీ ఊహాగానాల దశలోనే ఉన్నాయి.