Page Loader
టీ20ల్లో సరికొత్త మైలురాయిని అందుకున్న బాబర్ ఆజం
టీ20ల్లో 76 సెంచరీలు నమోదు చేసిన బాబర్ ఆజం

టీ20ల్లో సరికొత్త మైలురాయిని అందుకున్న బాబర్ ఆజం

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 17, 2023
03:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీ20ల్లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం సరికొత్త మైలురాయిని అందుకున్నాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) ఎలిమినేటర్ 1లో ఇస్లామాబాద్ యునైటెడ్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసి ఆ ఫీట్ ను సాధించాడు. టీ20ల్లో అత్యంత వేగంగా 9వేల పరుగుల చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. బాబర్ ఆజం కేవలం 245 టీ20ల్లో 9,000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. 249 ఇన్నింగ్స్‌లు ఆడి ఈ మైలురాయిని అందుకున్న క్రిస్‌గేల్ రికార్డును బాబర్ ఆజం బద్దలు కొట్టాడు. భారత ఆటగాడు విరాట్ కోహ్లి 271 ఇన్నింగ్స్‌లలో ఈ మార్కును సాధించాడు. ఓవరాల్‌గా బాబర్ టీ20ల్లో ఎనిమిది సెంచరీలు సాధించాడు.

బాబర్

టీ20ల్లో 76 హాఫ్ సెంచరీలు చేసిన బాబర్

బాబర్ పీఎస్ఎల్‌లో 78 మ్యాచ్ లు ఆడి 43.83 సగటుతో 2,893 పరుగులు చేశాడు. ఈ లీగ్‌లో 28 అర్ధసెంచరీలు, ఒక సెంచరీని సాధించాడు. ఈ సీజన్‌లో, బాబర్ 10 మ్యాచ్‌లలో 53.33 సగటుతో 480 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో పెషావర్ తరఫున ఒక సెంచరీ, ఐదు అర్ధసెంచరీలు చేశాడు. పెషావర్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి 183/8 స్కోరు చేసింది. ఇందులో బాబర్ ఆజం అర్ధ సెంచరీతో రాణించాడు. ఈ అర్ధ సెంచరీతో బాబర్ టీ20ల్లో 76 హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అనంతరం లక్ష్య చేధనకు దిగిన ఇస్లామాబాద్ యునైటెడ్ 171/6 స్కోరు చేసి పరాజయం పాలైంది.