Page Loader
Babar Azam: పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ అరుదైన ఘనత.. అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డు
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ అరుదైన ఘనత.. అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డు

Babar Azam: పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ అరుదైన ఘనత.. అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 18, 2025
12:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ అరుదైన ఘనతను సాధించాడు. ఆస్ట్రేలియాలో నిర్వహించే బిగ్‌బాష్ లీగ్‌లో (BBL) అత్యధిక ధర పలికిన ఆటగాడిగా ఓ కొత్త రికార్డు నెలకొల్పాడు. అందుబాటులో ఉన్న నివేదికల ప్రకారం, 2025-26 సీజన్ కోసం సిడ్నీ సిక్సర్స్ ఫ్రాంచైజీ బాబర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ విలువ 4,20,000 ఆస్ట్రేలియన్ డాలర్లు. పాకిస్తాన్ కరెన్సీలో ఇది సుమారు రూ.7.7 కోట్లు కాగా, భారత రూపాయల ప్రకారం రూ.2.35 కోట్లకు సమానం. ఈ ఒప్పందాన్ని సిక్సర్స్ ఫ్రాంచైజీ డ్రాఫ్ట్‌కి ముందే బాబర్‌తో ఖరారు చేసింది, అంటే ఇది "ప్రీ-డ్రాఫ్ట్ సైన్‌"గా పరిగణించబడుతోంది. బిగ్‌బాష్‌లో విదేశీ ఆటగాళ్లను డ్రాఫ్ట్‌కు ముందే ఫ్రాంచైజీలు ప్రీ-డ్రాఫ్ట్ ఒప్పందాల ద్వారా తీసుకునే అవకాశం కల్పిస్తున్నారు.

వివరాలు 

బీబీఎల్ చరిత్రలో అత్యధిక పారితోషికం పొందిన ఆటగాడు 

బాబర్‌తో పాటు, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌తో కూడా సిక్సర్స్ ఇలాగే ముందస్తుగా ఒప్పందం కుదుర్చుకుంది. బాబర్‌కు ఇది బీబీఎల్‌లో తొలి సీజన్ అవుతుండగా, ఇతని ఆస్ట్రేలియన్ టీ20 లీగ్ అరంగేట్రం కూడా ఇదే సీజన్‌లో జరగనుంది. ఈ ఏడాది బీబీఎల్ డ్రాఫ్ట్ జూన్ 19న నిర్వహించనున్నారు. బాబర్ బిగ్‌బాష్ చరిత్రలోనే అత్యధిక మొత్తానికి ఒప్పందం కుదుర్చుకున్న ఆటగాడిగా పాకిస్తాన్ మీడియా ప్రఖ్యాతి చాటుతోంది. సాధారణంగా ప్లాటినం కేటగిరీలో ఉన్న విదేశీ ఆటగాళ్లకు గరిష్టంగా 3,40,000 ఆస్ట్రేలియన్ డాలర్లు చెల్లించడమే సంప్రదాయం. కానీ బాబర్‌కు ఆ మొత్తం కంటే ఏకంగా 80,000 డాలర్లు ఎక్కువగా చెల్లించేందుకు సిద్దమైంది సిక్సర్స్.

వివరాలు 

బీబీఎల్‌ చరిత్రలో అత్యంత ఖరీదైన టాప్-5 ఆటగాళ్ల జాబితా: 

ఇప్పటివరకు బీబీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు కొనుగోలు చేసిన రికార్డు డి'ఆర్సీ షార్ట్ పేరుతో ఉంది. 2023-24 సీజన్‌లో హోబర్ట్ హరికేన్స్ అతనికి 2,58,900 ఆస్ట్రేలియన్ డాలర్లు చెల్లించింది. డి'ఆర్సీ షార్ట్ - $2,58,900 (హోబార్ట్ హరికేన్స్) ఆండ్రూ టై - $2,46,800 (పెర్త్ స్కార్చర్స్) మార్కస్ స్టోయినిస్ - $2,27,900 (మెల్బోర్న్ స్టార్స్) క్రిస్ లిన్ - $2,02,000 (బ్రిస్బేన్ హీట్) జో రూట్ - $2,00,000 (సిడ్నీ థండర్)

వివరాలు 

బీబీఎల్‌లో ఆటగాళ్ల జీతాల శ్రేణుల వివరాలు: 

ప్లాటినం: $3,40,000 గోల్డ్: $2,60,000 సిల్వర్: $1,75,000 కాంస్యం: $1,00,000

వివరాలు 

ఐపీఎల్‌లోని అన్‌క్యాప్డ్ ప్లేయర్లతో పోలిస్తే తక్కువే 

బీబీఎల్‌లో అత్యధికంగా పారితోషికం పొందుతున్నా, బాబర్‌కు ఐపీఎల్‌లోని కొన్ని అన్‌క్యాప్డ్ ప్లేయర్ల కంటే తక్కువ రెమ్యునరేషన్ లభిస్తోంది. ఉదాహరణకు, బాబర్‌కు భారత కరెన్సీలో సుమారు రూ.2.35 కోట్లు లభిస్తున్నా, పంజాబ్ కింగ్స్ తరఫున ఐపీఎల్ ఆడే అన్‌క్యాప్డ్ ఆటగాడు ప్రియాంశ్ ఆర్య రూ.3.5 కోట్లు పొందుతున్నాడు. ఇక మరోవైపు, అంతర్జాతీయ క్రికెట్ లీగ్‌లలో అనేక మ్యాచ్‌లు ఆడుతున్న బాబర్‌కు తన స్వదేశం పాకిస్తాన్ టీ20 జట్టులో మాత్రం చోటు దక్కలేదు. పీఎస్‌ఎల్, సీపీఎల్, ఎల్‌పీఎల్, బీపీఎల్, బీబీఎల్ లాంటి లీగ్‌ల్లో బరిలోకి దిగుతున్న బాబర్‌తో పాటు, మరో ఇద్దరు ప్రముఖులు మహ్మద్ రిజ్వాన్, షాహీన్ అఫ్రిదిలను కూడా పాకిస్తాన్ టీ20 జట్టులోకి ఎంపిక చేయలేదు.