Page Loader
Asia Cup: అతని బౌలింగ్‌లో బాబర్ ఆజం ఆడడం చాలా కష్టం: మహ్మద్ కైఫ్
అతని బౌలింగ్‌లో బాబర్ ఆజం ఆడడం చాలా కష్టం : మహ్మద్ కైఫ్

Asia Cup: అతని బౌలింగ్‌లో బాబర్ ఆజం ఆడడం చాలా కష్టం: మహ్మద్ కైఫ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 01, 2023
05:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా కప్ 2023లో భాగంగా భారత్-పాకిస్థాన్ మ్యాచుకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు శ్రీలంకలోని పల్లెకెలే వేదికగా ఈ హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. బ్యాటింగ్‌లో టీమిండియా, బౌలింగ్‌లో పాకిస్థాన్ పటిష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్, పేసర్ మహ్మద్ షమీ బౌలింగ్ లో ఆడటానికి ఇబ్బంది పడుతాడని టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ తెలిపారు. బుమ్రా గాయం కారణంగా వైదొలిగినప్పుడు, ఆ స్థానంలో షమీ చక్కగా విధులు నిర్వర్తించాడని, రోహిత్ శర్మ నేతృత్వంలో షమీ జట్టులో కీలకంగా వ్యవరిస్తున్నారని కైఫ్ చెప్పుకొచ్చాడు.

Details

షమీ అద్భుత ఫామ్ లో ఉన్నాడు

మహ్మద్ షమీ అద్భుతమైన బౌలర్ అని, అతని ఫామ్ కూడా చాలా బాగుందని, బుమ్రా లేనప్పుడు తన ప్రతిభను నిరూపించుకున్నాడని, ఐపీఎల్‌లో షమీ అద్భుతంగా రాణించాడని, షమీ బౌలింగ్‌లో బాబర్ ఆజం ఆడటానికి ఇబ్బందులు పడుతాడని కైఫ్ వెల్లడించారు. భారత జట్టు ఇదే రోహిత్‌ శర్మ, శుబ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మ, ఇషాన్‌ కిషన్‌, హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, శార్దూల్‌ ఠాకూర్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్‌, కుల్దీప్‌ యాదవ్‌, ప్రసిద్‌ కృష్ణ. స్టాండ్‌ బై: సంజూ శాంసన్‌.