
Babar Azam: బాబర్ ఆజం కెప్టెన్సీపై వేటు వేయండి.. మాజీ క్రికెటర్లు ఫైర్!
ఈ వార్తాకథనం ఏంటి
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో వరుస పరాజయాలతో సతమతమవుతున్న పాకిస్థాన్ జట్టుకు సెమీస్ అవకాశాలు సంక్లిష్టమయ్యాయి.
ఈ నేపథ్యంలో బాబార్ అజామ్ లక్ష్యంగా మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. కెప్టెన్సీ రోల్‌కు అతడు ఏ మాత్రం సరిపోడని మండిపడుతున్నారు.
టీమిండియా, ఆస్ట్రేలియా, ఆప్ఘనిస్తాన్ చేతిలో వరుసగా పాక్ జట్టు ఓడిపోయింది.
బాబార్ కెప్టెన్సీపై ఆ జట్టు మాజీ ప్లేయర్లు వాసిమ్ అక్రమ్, మిస్బా ఉల్ హక్, రమీజ్ రాజా, రషీద్ లతీఫ్, ముహమ్మద్ హఫీజ్, ఆకిబ్ జావేద్, షోయబ్ మాలిక్, మొయిన్ ఖాన్, షోయబ్ అక్తర్ అగ్రహం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం బాబర్ స్థానంలో మరోకరిని ఎంపిక చేయాలని మరోపక్క వాదనలు వినపడుతున్నాయి.
Details
షాహీన్ షా ఆఫ్రిదిని కెప్టెన్ గా నియమించాలి
బాబర్ స్థానంలో వైట్ బాల్ ఫార్మాట్‌లలో షాహీన్ షా ఆఫ్రిదీని కెప్టెన్‌గా నియమించాలని ఆకిబ్ అభిప్రాయపడుతున్నారు.
పాకిస్థాన్ క్రికెట్ భవిష్యత్తుకు షాహీన్ మార్గమని, కెప్టెన్‌గా నిరూపించుకోవడంతో బాబర్ విఫలమయ్యాడని పేర్కొన్నారు.
ఆటగాళ్ల ఫీల్డింగ్, బాడీ లాంగ్వేజ్ చాలా పేలవంగా ఉందని, 283 పరుగులను కాపాడుకోవడంలో విఫలమయ్యారని, ఫీల్డింగ్ మరి చెత్తగా ఉందని అక్రమ్ పేర్కొన్నాడు.
బాబర్ నెమ్మదిగా బ్యాటింగ్ చేసినప్పుడు అది ఇతర బ్యాటర్లపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, ఇతర ప్లేయర్లు వారి సహజ ఆటను ఆడలేరని, ఇది ఈ టోర్నమెంట్‌లో పాకిస్తాన్ స్ట్రైక్ రేట్‌ను ప్రభావితం చేస్తుందని రజాక్ చెప్పాడు.
సెమీఫైనల్‌కు అర్హత సాధించాలంటే పాకిస్థాన్ ఇప్పుడు ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌లతో ఆడే మ్యాచ్‌ల్లోనూ తప్పక గెలవాల్సి ఉంటుంది.