Page Loader
PSL 2023: అర్ధ సెంచరీతో చెలరేగిన బాబార్ ఆజం
టీ20ల్లో 73 అర్ధ సెంచరీలు చేసిన బాబార్ ఆజం

PSL 2023: అర్ధ సెంచరీతో చెలరేగిన బాబార్ ఆజం

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 24, 2023
03:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇస్లామాబాద్ యునైటెడ్‌తో జరిగిన పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) 2023 పోరులో పెషావర్ జల్మీ కెప్టెన్ బాబర్ అజామ్ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. దీంతో తన కెరియర్‌లో 73వ టీ20 హాఫ్ సెంచరీని నమోదు చేయడం గమనార్హం. ఏడు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 58 బంతుల్లో 75 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అయితే ఇస్లామాబాద్‌కు చెందిన జట్టు ఆరు వికెట్ల తేడాతో పెషావర్ జల్మీపై విజయం సాధించింది. దీంతో బాబర్ ఆజం చేసిన పోరాటం వృథా అయింది. కరాచీలోని నేషనల్ స్టేడియంలో యునైటెడ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మహ్మద్ హారిస్ (40), బాబర్ ఓపెనింగ్ వికెట్‌కు 76 పరుగులు జోడించి జల్మీకి అద్భుతమైన ఆరంభాన్ని అందించారు.

బాబార్ ఆజం

బాబార్ ఆజం సాధించిన రికార్డులివే

బాబార్ ఆజం 72 మ్యాచ్‌ల్లో 2,584 పరుగులు చేశాడు. దీంతో పీఎస్ఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా బాబర్ నిలిచాడు. గతేడాది బాబర్ 3,000 టీ20 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అదే విధంగా టీ20ల్లో 3,000 పరుగుల మార్క్‌ను చేరుకున్న ఐదో బ్యాటర్‌గా నిలిచాడు మొత్తం టీ20 ఫార్మాట్‌లో బాబర్ 248 మ్యాచ్‌ల్లో 8,720 పరుగులు చేశాడు. ఇందులో ఏడు సెంచరీలు, 73 అర్ధ సెంచరీలున్నాయి. పాకిస్థాన్ తరఫున షోయాబ్ మాలిక్ 12,492 పరుగులు అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా మొదటి స్థానంలో ఉన్నాడు.