Babar Azam: కోహ్లి రికార్డుకు బాబర్ బ్రేక్? టీ20లో రికార్డు సమం.. టాప్ 5 బ్యాట్స్‌మెన్ లిస్ట్ ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
జింబాబ్వేపై జరిగిన ట్రై సిరీస్ నాలుగో మ్యాచ్‌లో పాకిస్థాన్ కెప్టెన్ బాబార్ అజామ్ మరో ముఖ్యమైన మైలురాయిని నమోదు చేశాడు. తన అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో 38వ అర్థసెంచరీని పూర్తి చేసిన బాబర్, ఈ ఫార్మాట్‌లో అత్యధిక ఫిఫ్టీలు చేసిన విరాట్ కోహ్లీ రికార్డును సమం చేశాడు. టీ20ల్లో అత్యధిక అర్ధసెంచరీలు సాధించిన టాప్ 5 బ్యాట్స్‌మెన్ జాబితా ఇలా ఉంది. జింబాబ్వేపై బాబర్ ఆజం 74 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి, పాకిస్థాన్‌ను ఫైనల్ వరకు నడిపించాడు. ఈ ఇన్నింగ్స్‌తో అతని టీ20I ఫిఫ్టీల సంఖ్య 38కి చేరింది.
Details
38 హాఫ్ సెంచరీతో అగ్రస్థానం
దీంతో ఇప్పటివరకు 38 అర్ధసెంచరీలతో అగ్రస్థానంలో ఉన్న విరాట్ కోహ్లీ రికార్డును సమం చేశాడు. టీ20 వరల్డ్ కప్ 2024 గెలిచిన వెంటనే ఈ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లీ, తన టీ20 అంతర్జాతీయ కెరీర్‌లో మొత్తం 38 అర్ధసెంచరీలు సాధించాడు. కోహ్లీ ఇక ఈ ఫార్మాట్‌లో ఆడకపోవడంతో, బాబర్ ఆజం త్వరలోనే ఈ రికార్డును అధిగమించే అవకాశముంది. మాజీ భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. రోహిత్ తన టీ20I కెరీర్‌లో 151 ఇన్నింగ్స్‌ల్లో 32 అర్ధసెంచరీలు నమోదు చేశాడు.
Details
టాప్ 5 జాబితాలో డేవిడ్ వార్నర్
పాకిస్థాన్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ మహ్మద్ రిజ్వాన్ కూడా ప్రముఖ బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో నిలిచాడు. ఇప్పటివరకు అతను టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో 30 అర్ధసెంచరీలు చేశాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆస్ట్రేలియా స్టార్ డేవిడ్ వార్నర్ కూడా టాప్ 5 లిస్ట్‌లో కొనసాగుతున్నాడు. అతను తన టీ20I కెరీర్‌లో 28 ఫిఫ్టీలు సాధించాడు. ఇదే సంఖ్యతో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జోస్ బట్లర్ కూడా ఈ ర్యాంకింగ్స్‌లో 28 అర్ధసెంచరీలతో స్థానం పొందాడు.