
Pakistan: పాకిస్థాన్ జట్టుకు కొత్త కెప్టెన్.. ఎవరంటే?
ఈ వార్తాకథనం ఏంటి
టి20 ప్రపంచ కప్ సమీపిస్తున్న వేళ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.
పిసిబి ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లలో బాబర్ అజామ్ ని జాతీయ కెప్టెన్‌గా తిరిగి నియమించారు.
టి20 ఫార్మాట్ తో పాటు వన్డే ఫార్మాట్ కు అజామ్ నాయకత్వం వహించనున్నట్లు తెలిపింది.
కాగా,వన్డే ప్రపంచ కప్ లో పేలవ ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ బాబర్ అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ వదులుకున్నసంగతి తెలిసిందే.
గత ఏడాది,భారత్ లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో మెన్ ఇన్ గ్రీన్ సెమీఫైనల్‌కు చేరుకోవడంలో విఫలమవడంతో బాబర్ పాకిస్థాన్ జట్టు కెప్టెన్‌గా వైదొలిగాడు.
నెదర్లాండ్స్,శ్రీలంకపై విజయాలతో వరల్డ్ కప్ ప్రారంభించినప్పటికీ,పాకిస్థాన్ మొదటి నాలుగు స్థానాల్లో నిలవలేక పోవడంతో బాబర్ విమర్శలకు గురయ్యాడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పాకిస్థాన్ పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కి కెప్టెన్ గా బాబర్ అజామ్
.@babarazam258 to lead Pakistan men's team in white-ball cricket ©️🇵🇰 pic.twitter.com/PNZXIFH9yh
— Pakistan Cricket (@TheRealPCB) March 31, 2024