LOADING...
బెంగళూర్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. విధ్వంసకర బ్యాటర్ దూరం
ఐపీఎల్‌కు దూరమైన రజత్ పాటిదార్

బెంగళూర్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. విధ్వంసకర బ్యాటర్ దూరం

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 04, 2023
06:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2023 సీజన్‌లో ముంబై ఇండియన్స్ పై బెంగళూర్ రాయల్స్ ఛాలెంజర్స్ విజయం సాధించి మంచి జోష్ మీద ఉంది. ఈ తరుణంలో ఆ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టులోని విధ్వంసకర ఆటగాడు రజత్ పటిదార్ గాయం కారణంగా ఈ ఏడాది మొత్తం ఐపీఎల్ సీజన్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఆర్సీబీ ట్విట్టర్‌లో పోస్టు చేసింది. మడమ గాయంలో ఇబ్బందిపడుతున్న పాటిదార్.. కోలుకోవడానికి రెండు నెలల సమయం పట్టనుంది. ఈ క్రమంలోనే అతడు ఈ మెగా టోర్నికి దూరమయ్యాడు. గతేడాది జరిగిన ఐపీఎల్‌లో రజత్ పటిదార్ మెరిశాడు. గతేడాది జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌పై అద్భుతమైన సెంచరీ చేశాడు.

రజత్ పాటిదార్

రజత్ పాటిదార్ త్వరగా కోలుకోవాలి

దురదృష్టవశాత్తూ కాలి మడమ గాయం కారణంగా రజత్ పాటిదార్ ఐపీఎల్‌-2023 నుంచి తప్పుకున్నాడని, అతడు త్వరగా కోలుకోవాలని తాము కోరుకుంటున్నామని, అతనికి తాము ఎల్లప్పుడూ మద్దతునిస్తూనే ఉంటామని, ఇక పాటిదార్‌ స్థానంలో ఎవరని తీసుకోవాలన్నది కోచ్‌, మేనేజ్‌మెంట్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆర్సీబీ ట్వీట్‌ చేసింది. గతేడాది సీజన్‌లో 7 మ్యాచ్‌లు ఆడిన పాటిదార్‌ 333 పరుగులు సాధించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆర్సీబీకి ఆసీస్‌ స్టార్‌ పేసర్‌ జోష్‌ హాజిల్‌వుడ్‌ దూరం కాగా.. ఇప్పుడు పాటిదార్‌ దూరం కావడం రాయల్ ఛాలెంజర్స్ కు గట్టి ఎదురుదెబ్బె అని చెప్పొచ్చు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రజత్ పాటిదార్ గురించి ట్వీట్ చేసిన ఆర్సిబి