Page Loader
కోల్‌కత్తాకు బ్యాడ్ న్యూస్.. స్టార్ ఆల్ రౌండర్ దూరం
ఐపీఎల్ దూరమైన షకీబ్ అల్ హసన్

కోల్‌కత్తాకు బ్యాడ్ న్యూస్.. స్టార్ ఆల్ రౌండర్ దూరం

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 04, 2023
04:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్‌లో కోల్ కత్తా‌ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. మొదటి మ్యాచ్‌లో పంజాబ్ చేతిలో కోల్ కత్తా ఓడిపోయింది. బంగ్లాదేశ్ స్టార్ ఆల్ రౌండర్ షకిబ్ అల్ హసన్ ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. కోల్‌కత్తా జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న షకీబ్ ఆల్ హసన్ ఆ జట్టుకు దూరం కావడం పెద్ద మైనస్ గా చెప్పొచ్చు. బ్యాటింగ్, బౌలింగ్ లో అద్భుతంగా రాణించే షకీబ్.. మినీ వేలంలో కోల్‌కతా రూ.1.50 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ నుంచి వైదొలుగుతున్నట్లు షకీబ్.. కోల్ కతా ఫ్రాంచేజీకి సమాచారమివ్వడం గమనార్హం.

షకీబ్ అల్ హసన్

ఐపీఎల్‌కు షకీబ్ అల్ హసన్ దూరం

సమకాలిన ప్రపంచ క్రికెట్‌లోని అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో షకిబ్ ఒకడిగా పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. సుదీర్ఘ కాలం పాటు షకిబ్ కోల్‌కతా ప్రాతినిథ్యం వహించాడు. ఇలాంటి ఆటగాడి సేవలు అందుబాటులో లేకపోవడం జట్టు యాజమాన్యానికి షాక్‌కు గురి చేసింది. ఐర్లాండ్‌తో ఏప్రిల్ నుంచి బంగ్లాదేశ్ టెస్టు మ్యాచ్‌ను ఆడనుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్‌ పూర్తయ్యాక ఐపీఎల్‌లో అతను ఆడనున్నట్లు సమాచారం. మే 9, 12, 14 తేదీల్లో చెమ్స్‌ఫోర్డ్‌లో ఐర్లాండ్‌తో బంగ్లా మూడు వన్డేల సిరీస్‌ ఆడనుంది.