తదుపరి వార్తా కథనం
Mohammed Shami: భారత జట్టుకు బ్యాడ్‌న్యూస్.. మైదానాన్ని వీడిన స్టార్ బౌలర్
వ్రాసిన వారు
Jayachandra Akuri
Feb 23, 2025
03:22 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో భారత స్టార్ బౌలర్ మహ్మద్ షమీ మైదానాన్ని వీడారు.
బౌలింగ్ చేస్తున్న సమయంలో కాలి మడమ నొప్పితో తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఇప్పటికీ షమీ తిరిగి మైదానంలోకి వస్తారా లేదా అన్నదానిపై అనుమానాలు కొనసాగుతున్నాయి.
ఒకవేళ రాకపోతే భారత బౌలింగ్ విభాగం బలహీనపడే అవకాశం ఉంది.
షమీ లేకుంటే హర్షిత్ రానా, హార్దిక్ పాండ్యా మాత్రమే పేస్ బౌలింగ్ భారాన్ని మోయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక మ్యాచ్ పరిస్థితి చూస్తే, పాకిస్థాన్ 9.2 ఓవర్లలో 47 పరుగులు చేసి రెండు వికెట్లను కోల్పోయింది.