
RCB vs CSK: వికెట్లకు దూరంగా బంతి.. కానీ ఔట్.. జడేజా వాదనలను తోసిపుచ్చిన అంపైర్!
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్‌లో చైన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) ఓటమికి ఓ నిర్ణయమే కారణమంటూ సోషల్ మీడియాలో తీవ్రంగా చర్చ నడుస్తోంది.
చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru)తో జరిగిన కీలక మ్యాచ్‌లో సీఎస్కే రెండు పరుగుల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే.
అయితే ఈ మ్యాచ్‌లో డెవాల్డ్ బ్రెవిస్ (Dewald Brevis) ఔటైన తీరు ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీసింది. చెన్నై ఛేదనలో 17వ ఓవర్‌ను ఆర్సీబీ బౌలర్ లుంగి ఎంగిడి వేసాడు.
ఆ ఓవర్ రెండో బంతికి ఆయుష్ ఔటయ్యాడు. అనంతరం డెవాల్డ్ బ్రెవిస్ క్రీజ్‌లోకి వచ్చాడు. ఎంగిడి వేసిన లెగ్‌సైడ్ ఫుల్‌టాస్ బంతికి ఆర్సీబీ ఆటగాళ్లు అప్పీల్ చేయగా, అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు.
Details
రివ్యూకు అనుమతి ఇవ్వని అంపైర్
పరుగు కోసం పరుగెత్తుతున్న బ్రెవిస్, తొలుత విషయం గుర్తించలేదు. తరువాత నాన్‌స్ట్రైకర్ జడేజాతో చర్చించి డీఆర్‌ఎస్ (DRS) తీసుకోవాలని నిర్ణయించాడు.
కానీ అప్పటికే 15 సెకన్ల డీఆర్‌ఎస్ టైమర్ ముగియడంతో, ఫీల్డ్ అంపైర్ రివ్యూకు అనుమతి ఇవ్వలేదు. ఇక్కడే అసలు వివాదం మొదలైంది.
అభిమానుల ఆరోపణల ప్రకారం స్క్రీన్‌పై డీఆర్‌ఎస్ టైమర్ కనబడలేదు. దీనిపై సోషల్ మీడియాలో నిరసనలు వెల్లువెత్తాయి.
రవీంద్ర జడేజా తన అసహనాన్ని అంపైర్‌తో చర్చిస్తూ ఉన్న వీడియోలు వైరల్ అయ్యాయి. ఇక రివ్యూలో చూసినప్పుడు బంతి వికెట్లకు చాలా దూరంగా వెళ్తున్నట్లు స్పష్టంగా కనిపించింది.
Details
మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదని వాదన
ఈ ఘటనపై అభిమానులు స్పందిస్తూ, ఇలాంటి కీలక సమయంలో అంపైర్లు కొంత వెసులుబాటు చూపించాలని అభిప్రాయపడుతున్నారు.
బ్రెవిస్ ఔట్ కాకుండా ఉండి ఉంటే ఒక పరుగు వచ్చి ఉండేదని, దీంతో మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదని పలువురు పేర్కొంటున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
Time's up ⌛
— Star Sports (@StarSportsIndia) May 3, 2025
Dropped catches, scintillating boundaries, back-to-back wickets & endless drama... 🥶#ViratKohli vs #MSDhoni - one last time? Is living up to the expectations! Who's winning it from here? 👇✍🏻
Watch the LIVE action ➡ https://t.co/dl97nUfgCR #IPLonJioStar 👉… pic.twitter.com/0uSxPYEoWL