ఎంఎస్ ధోనిపై నిషేధం.. ఫైనల్ మ్యాచ్‌కు దూరం..?
ఐపీఎల్ 2023లో ఎంఎస్ ధోని సారథ్యంలో చైన్నై సూపర్ కింగ్స్ మరోసారి ఫైనల్స్ లో అడుగుపెట్టింది. పదిసార్లు ఫైనల్ కు చేరిన జట్టుగా సీఎస్కే రికార్డు సృష్టించింది. ఈ నెల 28వ తేదీన ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ధోనితో తలపడే జట్టు ఏదనేది ఇంకా తెలాల్సి ఉంది. మంగళవారం రాత్రి చెపాక్ స్టేడియంలో జరిగిన క్వాలిఫయర్-1లో గుజరాత్ టైటాన్స్ ను చైన్నై చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన చైన్నై నిర్ణీత 20 ఓవర్లో ఏడు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. గుజరాత్ టైటాన్స్ 157 ఆలౌటై.. 15 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచులో ధోని చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది.
ధోనీపై ఓ మ్యాచ్ నిషేధం విధించే అవకాశం?
ధోనీ తప్పు చేసినట్లు తేలితే ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం అతనిపై ఓ మ్యాచ్ నిషేధం విధించే అవకాశం కూడా ఉంది. ఇన్నింగ్స్ 16వ ఓవర్లో మతీషా పతిరణను బౌలింగ్ చేయడానికి అంపైర్లు అంగీకరించలేదు. తొమ్మిది నిమిషాల పాటు గ్రౌండ్ లో లేకపోవడం, విశ్రాంతి తీసుకొని బౌలింగ్ చేయడానికి రావడంతో అంపైర్లు క్రిస్ గఫానీ, అనిల్ చౌదరి అతన్ని ఆపేశారు. దీనిపై ధోని అభ్యంతరం వ్యక్తం చేసి,అంపైర్లతో వాగ్వావాదానికి దిగాడు. సూమారు ఐదు నిమిషాల పాటు అంపైర్లతో ధోని వాదించాడు. ఎనిమిది నిమిషాలకు పైగా గ్రౌండ్ లో లేకపోతే అతనిపై నిబంధనలు విధించే అవకాశం అంపైర్లకు ఉంటుంది. నిబంధనలు స్పష్టంగా ఉన్న ధోని సమయం వృథా చేసినట్లు గవర్నింగ్ కౌన్సిల్ భావిస్తోంది.