Page Loader
IPL 2023: ఆ పార్టీలో ధోనీ ఏడ్చేశాడు: హర్భజన్ సింగ్!
ఎంఎస్ ధోని గురించి ప్రస్తావించిన హర్భజన్ సింగ్

IPL 2023: ఆ పార్టీలో ధోనీ ఏడ్చేశాడు: హర్భజన్ సింగ్!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 23, 2023
06:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత క్రికెటర్ ఎంఎస్ ధోని తన టాలెంట్ తో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అన్ని వయసుల వారు ధోనికి వీరాభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అత్యంత సక్సెస్ ఫుల్ కెప్టెన్లలో ధోనీ ఒకడు. ఈ ఏడాది ఐపీఎల్ లో చైన్నై సూపర్ కింగ్స్ ను తన సారథ్యంలో ఫ్లే ఆఫ్స్ కి తీసుకొచ్చాడు. ప్రస్తుతం చైన్నై గుజరాత్ తో క్వాలిఫైయర్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మాజీ టీం సభ్యులు కొందరు ధోనీతో ఉన్న తమ అనుభవాలను పంచుకున్నారు. ఐపీఎల్ లో చైన్నైని రెండేళ్లు బ్యాన్ చేసిన తర్వాత.. రీఎంట్రీ ఇచ్చి ఏకంగా టైటిల్ ను నెగ్గింది.

Details

ధోనీని చూసి జట్టు సభ్యులంతా ఎమోషనల్ అయ్యారు

ఆ ఏడాది డిన్నర్ సందర్భంగా జరిగిన ఒక షాకింగ్ ఘటనను హర్భజన్ సింగ్ గుర్తు చేసుకున్నాడు. ఈ ఘటనను తాను మార్చిపోలేనని చెప్పాడు. మాములుగా మగాడి కంట కన్నీళ్లు రావు అనే డైలాగులు మనం వింటామని, కానీ ఆ రోజు డిన్నర్ సమయంలో ధోనీ ఏడ్చేశాడని హర్భజన్ సింగ్ గుర్తు చేసుకున్నాడు. ధోని ఆ సమయంలో చాలా ఎమోషనల్ అయిపోయాడని.. దీని గురించి ఎవరికి తెలియదని అందుకే చెబుతున్నానని బజ్జీ వెల్లడించారు. దీనిపై ఇమ్రాన్ తాహిర్ స్పందిస్తూ.. ఆ క్షణంలో ధోని చాలా ఎమోషనల్ అయ్యాడని, ఆ సమయంలో తాను కూడా పక్కనే ఉన్నానని తాహిర్ పేర్కొన్నారు. ధోనీని అలా చూసి తామందరం కూడా చాలా ఎమోషనల్ అయిపోయామని పేర్కొన్నారు.