BAN Vs AFG : టీ20 సిరీస్‌పై గురిపెట్టిన ఆప్ఘనిస్థాన్
రెండు మ్యాచుల టీ20 సిరీస్‌లో తలపడేందుకు బంగ్లాదేశ్, అప్ఘనిస్తాన్ సిద్ధమయ్యాయి. ఇప్పటికే వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో అప్ఘనిస్తాన్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. చివరి వన్డేల్లో 7 వికెట్ల తేడాతో బంగ్లా గెలిచి వైట్‌వాష్ కాకుండా తప్పించుకుంది. వన్డే సిరీస్‌ను చేజార్చుకున్న బంగ్లా ఎలాగైనా టీ20 సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఇక వన్డే సిరీస్‌ను దక్కించుకొని ఆత్మవిశ్వాసంతో ఉన్న అప్ఘనిస్తాన్, టీ20 సిరీస్‌ను దక్కించుకోవాలని పట్టుదలతో ఉంది. సిల్హెట్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రేపు మొదటి టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మైదానంలో జరిగిన 46 మ్యాచుల్లో మొదటి బ్యాటింగ్ చేసిన జట్లు 28సార్లు గెలుపొందాయి. మ్యాచ్ ఫ్యాన్‌కోడ్ యాప్‌లో సాయంత్రం 5:30 గంటలకు ప్రత్యక్ష ప్రసారం కానుంది.
ఇరు జట్లలోని సభ్యులు
టీ20ల్లో బంగ్లాదేశ్‌పై అప్ఘనిస్తాన్‌కు మెరుగైన రికార్డు ఉంది. ఇప్పటి వరకు ఇరు జట్లు తొమ్మిదిసార్లు తలపడగా ఇందులో ఇరుసార్లు అప్ఘనిస్తాన్ విజయం సాధించింది. ఇక టీ20 సిరీస్ లో ఎవరు పైచేయి సాధిస్తారో వేచిచూడాలి బంగ్లాదేశ్ : లిట్టన్ దాస్ (వికెట్ కీపర్), నజ్ముల్ హుస్సేన్ శాంటో, తౌహిద్ హృదయ్, షకీబ్ అల్ హసన్, రోనీ తాలుక్దార్, (కెప్టెన్), అఫీఫ్ హొస్సేన్, మెహిదీ హసన్, తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మాన్. ఆఫ్ఘనిస్తాన్: రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), హజ్రతుల్లా జజాయ్, మహ్మద్ షాజాద్, ఇబ్రహీం జద్రాన్, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్ (కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, నూర్ అహ్మద్, ముజీబు రహఖ్‌మాన్, ఫ్ఫజ్ రహక్మాన్.