ICC World Cup 2023: వరల్డ్ కప్ కోసం జట్టును ప్రకటించిన బంగ్లాదేశ్.. మాజీ కెప్టెన్‌కి దక్కని చోటు!
అక్టోబర్ 5 నుంచి భారత్‌తో జరగనున్న వన్డే వరల్డ్ కప్ 2023 కోసం బంగ్లాదేశ్ తమ జట్టును ప్రకటించింది. బంగ్లాదేశ్ జట్టుకు సీనియర్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హాసన్ నాయకత్వం వహిస్తుండగా, నజ్ముల్ హుసేన్ షాంటో వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. 15 మందితో కూడిన జట్టులో ముష్ఫికర్ రహీమ్, లిట్టన్ దాస్, మెహిదీ హాసన్ మిరాజ్, మెహదీ హాసన్, షోరిఫుల్ ఇస్లాం వంటి ఆటగాళ్లకు అవకాశం దక్కింది. అయితే ఆ జట్టు మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ కు అవకాశం లభించలేదు. తమీమ్ ఇటీవల వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి, ఆ తర్వాత ఆ దేశ ప్రధాని షేక్ హసీనా పిలుపు మేరకు రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే.
వరల్డ్ కప్ కు ఎంపికైన బంగ్లా జట్టు ఇదే
తమీమ్‌ను వరల్డ్ కప్ జట్టులోకి తీసుకోకపోవడానికి బంగ్లా ప్రస్తుత కెప్టెన్ షకీబ్‌తో ఉన్న విభేదాలే కారణమని సమాచారం. ఇదిలా ఉంటే, వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ తమ తొలి మ్యాచును అక్టోబర్ 7న ఆడనుంది. ధర్మశాల వేదికగా జరిగే ఆ మ్యాచులో బంగ్లా జట్టు ఆప్గనిస్థాన్‌తో తలపడనుంది. బంగ్లాదేశ్ జట్టు షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), ముష్ఫికర్ రహీం, లిటన్ దాస్, నజ్ముల్ హొసేన్ షాంటో, మెహిది హసన్ మీరజ్, తౌహిద్ హ్రిదోయ్,తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, షొరీఫుల్ ఇస్లాం, హసన్ మహమూద్, నసుమ్ అహ్మద్, మెహిది హసన్, తంజిమ్ షకీబ్, తంజిద్ తమీమ్, మహ్మదుల్లా రియాద్