Page Loader
Shakib Al Hasan: అభిమానిని చెంపదెబ్బ కొట్టిన బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్.. వీడియో వైరల్‌ 
Shakib Al Hasan: అభిమానిని చెంపదెబ్బ కొట్టిన బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్.. వీడియో వైరల్‌

Shakib Al Hasan: అభిమానిని చెంపదెబ్బ కొట్టిన బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్.. వీడియో వైరల్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 08, 2024
01:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

బంగ్లాదేశ్ పురుషుల జాతీయ క్రికెట్ జట్టు కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఆ దేశంలో జరిగిన ఎన్నికల్లో మగురా-1 పార్లమెంట్ స్థానం నుంచి పోటీచేసి విజయం సాధించారు. అయితే, షకీబ్ అల్ హసన్ అయితే, ఎన్నికల ఫలితాలు రాకముందు అతను ఓ అభిమానిపై చేయిచేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. షకీబ్ ఎన్నికల సమయంలో ఓ పోలింగ్ స్టేషన్ వద్ద పరిస్థితిని పరిశీలించేందుకు వెళ్లాడు. అక్కడ భారీ సంఖ్యలో అభిమానులు అతన్ని చుట్టుముట్టారు. వీరిలో ఓ అభిమాని షకీబ్ అల్ హసన్ వద్దకు వెళ్లి అతనిపై చేయివేసేందుకు ప్రయత్నించడంతో.. షకీబ్ అల్ హసన్ సదరు అభిమానిని చెంప చెళ్లుమనిపించాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Details 

 1,50,000 ఓట్ల తేడాతో షకీబ్ హసన్ విజయం 

ఎన్నికల విషయానికొస్తే, హసన్ మగురా-1 పార్లమెంట్ సీటుకు పోటీచేసి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాజీ రెజాల్ హుస్సేన్ పై 1,50,000 ఓట్ల తేడాతో షకీబ్ హసన్ విజయం సాధించాడు. ఎన్నికలలో విజయం సాధించాక షకీబ్ మాట్లాడుతూ,చిన్న జట్టు అయినా, పెద్ద టీమ్ అయినా పోటీ, సవాళ్లు ఎప్పుడూ ఉంటాయి" అని పేర్కొన్నాడు. ఎన్నికలలో ప్రచారం కోసం షకీబ్ క్రికెట్ నుండి తాత్కాలికంగా సెలవు తీసుకున్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ద్వారా ఏకకాలంలో మూడు ఫార్మాట్లలో నంబర్ వన్ ఆల్ రౌండర్ ర్యాంక్ పొందిన ఏకైక వ్యక్తి షకీబ్.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అభిమానిని చెంపదెబ్బ కొట్టిన షకీబ్