
Towhid Hridoy: బంగ్లాదేశ్ ఆటగాడిపై నిషేధం.. కారణం ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
బంగ్లాదేశ్ క్రికెటర్ తౌహిద్ హృదోయ్‌పై నిషేధం విధించారు. ఢాకా ప్రీమియర్ లీగ్ (డీపీఎల్) 2025 సీజన్‌లో అంపైర్ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేసినందుకు, అతడికి నాలుగు మ్యాచ్‌ల సస్పెన్షన్ వచ్చింది.
అంతేకాదు, అతడి ఖాతాలో 8 డీమెరిట్ పాయింట్లు కూడా జతచేశారు. డీపీఎల్ 2025లో అబాహానీ లిమిటెడ్‌తో జరగనున్న కీలక మ్యాచ్‌తోపాటు, వచ్చే సీజన్ ప్రారంభంలోని మూడు మ్యాచ్‌లకు తౌహిద్ దూరం కానున్నాడు.
ప్రస్తుతం డీపీఎల్ 2025లో తౌహిద్ మొహమ్మదన్ స్పోర్టింగ్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
తాజాగా గాజీ గ్రూప్ క్రికెటర్స్‌తో తౌహిద్ హృదోయ్ ఆడిన మ్యాచ్‌లో 54 బంతుల్లో 37 పరుగులు చేశాడు.
Details
నాలుగు మ్యాచులు నిషేధం
అవుటైన అనంతరం, అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. మైదానపు దిశను చూపిస్తూ తలను అడ్డంగా ఊపాడు.
ఈ ప్రవర్తనను డీపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం లెవల్ 1 నేరంగా పరిగణించారు. దీని కారణంగా అతడికి Tk 10,000 (సుమారు రూ.7,026) జరిమానా విధించారు,
అలాగే ఒక డీమెరిట్ పాయింట్ కూడా చేర్చారు. ఇంతకుముందు అతడి ఖాతాలో ఇప్పటికే మూడు డీమెరిట్ పాయింట్లు ఉండటంతో, నాలుగు మ్యాచ్‌ల నిషేధానికి గురయ్యాడు.
తౌహిద్ హృదోయ్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసిన విషయం తెలిసిందే.