తదుపరి వార్తా కథనం

ఒంటికాలితో యువకుడు బ్యాటింగ్.. ఫిదా అవుతున్న నెటిజన్లు (Video)
వ్రాసిన వారు
Jayachandra Akuri
Sep 21, 2023
01:47 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియాలో క్రికెట్ ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ప్రతి ఇంటి నుంచి ఓ యువకుడు క్రికెట్ ఆడటానికి ఇష్టపడుతుంటారు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ క్రికెట్ అంటే ఇష్టపడతారు.
మరోవైపు దివ్యాంగులకు కూడా క్రికెట్ ఆడుతుండటం మనం చూస్తుంటాం. తాజాగా అలాంటి ఓ వ్యక్తి క్రికెట్ ఆడుతున్న వీడియో వైరల్‌గా మారింది. అతను ఒంటి కాల్‌తో బ్యాటింగ్ చేస్తున్న వీడియోను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
వైకల్యం క్రికెట్ కు అడ్డు రాదంటూ అందరికీ అదర్శంగా నిలుస్తుంటాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో లైకులు, కామెంట్లతో హోరెత్తుతోంది.
ఈ వీడియోపై నెటిజన్లు అతన్ని ఉత్సహరుస్తూ కామెంట్లు పెడుతుండటం విశేషం.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఒంటి కాలుతో బ్యాటింగ్ చేస్తూ అశ్చర్య పరుస్తున్న యువకుడు
Cricket is for EVERYONE ❤️
— Cricket Shouts 🏏 (@crickshouts) September 20, 2023
Inspirational!
via @TheBarmyArmy
pic.twitter.com/v7qXMqJXGk