Page Loader
బేయర్స్ మ్యానిచ్ చేతిలో పారిస్ సెయింట్-జర్తైన్ పరాజయం
బేయర్న్‌ను ఓడించడంలో విఫలమైన ఎంబాప్పే

బేయర్స్ మ్యానిచ్ చేతిలో పారిస్ సెయింట్-జర్తైన్ పరాజయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 09, 2023
10:45 am

ఈ వార్తాకథనం ఏంటి

అలియాంజ్ ఎరీనాలో జరిగిన UEFA ఛాంపియన్స్ లీగ్‌లో పారిస్ సెయింట్-జర్మైన్‌ను బేయర్న్ మ్యునిచ్ ఓడించింది. 2-0తేడాతో బేయర్న్ మ్యునిచ్ చేతిలో పారిస్ సెయింట్-జర్మైన్‌ ఓటమి పాలైంది. ఈ సీజన్‌లో చౌపో-మోటింగ్ తన 4వ ఛాంపియన్స్ లీగ్ గోల్‌ను సాధించాడు. అతను 2022-23లో బేయర్న్ కోసం 17 గోల్స్ చేసి, నాలుగు అసిస్ట్‌లను కలిగి ఉన్నాడు. మొత్తంగా, చౌపో-మోటింగ్ బేయర్న్ కోసం 35 గోల్స్ చేసి సత్తా చాటాడు. బేయర్న్ ఆరు గ్రూప్-స్టేజ్ మ్యాచ్‌లను గెలిచి రౌండ్ ఆఫ్ 16కి చేరుకుంది. బేయర్న్ గ్రూప్ సిలో 18 పాయింట్లతో ఇంటర్ మిలన్, బార్సిలోనా కంటే ముందు స్థానంలో నిలిచింది.

పీఎస్‌జీ

పీఎస్‌జీ చెత్త రికార్డు

PSG ఏడు సీజన్లలో ఐదవసారి R16లో ఛాంపియన్స్ లీగ్ నుండి నిష్క్రమించి చెత్తా రికార్డును మూటకట్టుకుంది. 2019-20లో ఫైనల్‌కు, 2020-21లో సెమీస్‌కు చేరుకుంది. 2016-17 సీజన్‌కు ముందు నాలుగుసార్లు క్వార్టర్స్‌‌కు చేరుకున్నారు. పీఎస్‌జీ 55శాతం బంతిని కలిగి ఉండి, 87శాతం ఖచ్చితత్వాన్ని కలిగి ఉంది. బేయర్న్ నాలుగు కార్నర్లతో పోలిస్తే పీఎస్‌జీ ఆరు కార్నర్‌లను సంపాదించింది. బేయర్న్ తరఫున ఈ సీజన్‌లో తన 34వ మ్యాచ్‌ని ఆడుతున్న గ్నాబ్రీ 12 గోల్స్‌ చేసి, 10 అసిస్ట్‌లను సాధించాడు. గ్యాబ్రీ బేయర్న్ తరపున 205 మ్యాచ్‌లలో 76 గోల్స్ సాధించాడు.