Page Loader
బిగ్ బాష్ లీగ్ మ్యాచ్‌లపై క్లారిటీ..!
బిగ్‌బాష్ లీగ్ మ్యాచ్

బిగ్ బాష్ లీగ్ మ్యాచ్‌లపై క్లారిటీ..!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 03, 2023
10:03 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ తరహాలో సక్సెస్ అయిన మరో క్రికెట్ లీగ్ ఏదైనా ఉందంటే.. అది ఆస్ట్రేలియాలో జరిగే బిగ్‌బాష్ లీగ్‌యేనన్నది జగమెరిగిన సత్యం. తాజాగా ఈ మహాసంగ్రామానికి సంబంధించి ఒక కీలక అప్డేట్ వచ్చింది. 2024-2025 సీజన్‌కు సంబంధించి 43 మ్యాచ్‌లు వరకూ తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఫాక్స్‌టెల్ గ్రూప్, సెవెన్ వెస్ట్ మీడియాతో ఆస్ట్రేలియా క్రికెట్ ఏడేళ్లు ప్రసార ఒప్పందాలను కుదుర్చుకుంది. BBL చివరిసారిగా 2017-18 సీజన్‌లో 43 మ్యాచ్‌లను ఆడింది. ఫైనల్స్ సిరీస్ సహా 61 మ్యాచ్‌లు జరిగాయి. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆస్ట్రేలియన్ ఆటగాళ్ళు, స్వదేశీ T20 లీగ్‌లో అరుదుగా ఆడటం విమర్శలకు దారి తీస్తోంది. దీని కారణంగా ప్లేయర్లు దొరకడం లేదు.

బిగ్ బాష్ లీగ్

బిగ్‌బాష్ లీగ్‌లో సమూల మార్పలు..?

జనవరి టెస్టు సిరీస్ పూర్తి అయిన తర్వాత సిడ్నీ థండర్‌కు డేవిడ్ వార్నర్, సిడ్నీ సిక్సర్స్‌కు స్టీవ్ స్మిత్ ప్రాతినిథ్యం వహిస్తారు. SA20, ILT20 లీగ్ వల్ల చాలా మంది విదేశీ క్రికెటర్ల ప్రతిభను కోల్పోవాల్సి వస్తోంది. భవిష్యత్ సీజన్లలో మార్పుతో లీగ్ సమూల మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఏడు సంవత్సరాల ప్రసార ఒప్పందాలను AUD అనే సంస్థ దక్కించుకుంది. ఇది 2024 నుండి 2030-31 వరకూ కొనసాగనుంది. ప్రస్తుత ఒప్పందంపై 13శాతం తగ్గింపు, ఉత్పత్తి ఖర్చుల నుండి కాల వ్యవధిలో AUD 50 మిలియన్ల కంటే ఎక్కువ నగదును ఆదా చేస్తామని సెవెన్ మంగళవారం తెలిపింది.