Page Loader
బంగ్లాదేశ్ ప్రధాన కోచ్‌గా మరోసారి చండికా హతురుసింఘ
బంగ్లాదేశ్ ప్రధాన కోచ్‌గా చండికా హతురుసింఘ

బంగ్లాదేశ్ ప్రధాన కోచ్‌గా మరోసారి చండికా హతురుసింఘ

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 01, 2023
12:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

బంగ్లాదేశ్ ప్రధాన కోచ్ మరోసారి చండికా హతురుసింఘ నియమితులయ్యారు. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మంగళవారం తెలిపింది. రెండేళ్ల పాటు కొత్త కోచ్‌గా చండికా బంగ్లాదేశ్‌కు సేవలందించనున్నారు. అంతకుముందు 2014 నుండి 2017 వరకు బంగ్లాదేశ్ ప్రధాన కోచ్‌గా హతురుసింఘ పనిచేసిన విషయం తెలిసిందే. హతురుసింఘ నేతృత్వంలో గతంలో బంగ్లాదేశ్ కొన్ని వన్డే సిరీస్ లను గెలుచుకుంది. ఇండియా, పాకిస్తాన్, ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్ లను బంగ్లాదేశ్ సాధించింది. శ్రీలంక, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాపై టెస్టు సిరీస్ లను కైవసం చేసుకుంది. ముఖ్యంగా 2017లో జరిగిన చాంఫియన్ ట్రోఫీలో బంగ్లాదేశ్ సెమీ ఫైనల్ కు అర్హత సాధించిన విషయం తెలిసిందే.

బంగ్లాదేశ్

బంగ్లా ఆటగాళ్లలో కలిసి పనిచేయడం ఆదృష్టం

బంగ్లాదేశ్ జాతీయ జట్టుకు మరోసారి కోచ్‌గా అవకాశం లభించడం గౌరవంగా భావిస్తున్నానని చండికా హతురుసింఘ పేర్కొన్నారు. తాను బంగ్లాదేశ్‌కు వెళ్లినప్పుడల్లా అక్కడి ప్రజల తనని ఇష్టపడతారని, మరోసారి బంగ్లా ఆటగాళ్లతో కలిసి పనిచేయడం తన అదృష్టమన్నారు. గత నెలలో, రస్సెల్ డొమింగో బంగ్లాదేశ్ ప్రధాన కోచ్ పదవి నుండి వైదొలిగిన విషయం తెలిసిందే. అతని పదవీకాలం 2023 వన్డే ప్రపంచ కప్ వరకు ఉండగా.. మధ్యలోనే నిష్క్రమించాడు. డొమింగో నాయకత్వంలో గతేడాది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లతో స్వదేశంలో జరిగిన T20I సిరీస్‌ను బంగ్లా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.