IPL 2026: ఐపీఎల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. 70 మ్యాచ్‌ల షెడ్యూల్ ప్రకటించిన బీసీసీఐ
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. ముందుగా మొదటి దశలో కేవలం 20 మ్యాచ్‌లకు మాత్రమే తేదీలు, వేదికలను నిర్ధారించిన విషయం తెలిసిందే. ఇప్పుడు రెండో దశలో మిగిలిన 50 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది. దీంతో మొత్తం 70 లీగ్ మ్యాచ్‌ల షెడ్యూల్ పూర్తిగా వెల్లడైంది. అయితే, ప్లేఆఫ్ మ్యాచ్‌ల కోసం వేదికలను ఇంకా నిర్ణయించలేదు. మార్చి 28 నుంచి మే 24 వరకు లీగ్ దశ మ్యాచ్‌లు జరగనున్నాయి. ముందుగా మార్చి 28న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. లీగ్ దశ చివరి మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరగనుంది.
వివరాలు
రెండో దశలో భాగంగా మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే:
ఏప్రిల్ 13న హైదరాబాద్‌లో సన్‌రైజర్స్-రాజస్థాన్ జట్లు తలపడతాయి. ఏప్రిల్ 14న చెన్నైలో చెన్నై-కోల్‌కతా మ్యాచ్ జరుగుతుంది. ఏప్రిల్ 15న బెంగళూరులో ఆర్సీబీ-లక్నో మధ్య పోరు ఉంటుంది. ఏప్రిల్ 16న ముంబైలో ముంబై-పంజాబ్ మ్యాచ్ నిర్వహిస్తారు. ఏప్రిల్ 17న అహ్మదాబాద్‌లో గుజరాత్-కోల్‌కతా జట్లు తలపడతాయి. ఏప్రిల్ 18న మధ్యాహ్నం బెంగళూరులో ఆర్సీబీ-ఢిల్లీ మ్యాచ్, అదే రోజు రాత్రి హైదరాబాద్‌లో సన్‌రైజర్స్-చెన్నై మ్యాచ్ జరుగుతుంది. ఏప్రిల్ 19న కోల్‌కతాలో నైట్‌రైడర్స్-రాజస్థాన్ మ్యాచ్, చండీగఢ్‌లో పంజాబ్-లక్నో మ్యాచ్‌లు జరుగుతాయి. ఏప్రిల్ 20న అహ్మదాబాద్‌లో గుజరాత్-ముంబై మ్యాచ్ ఉంటుంది. ఏప్రిల్ 21న హైదరాబాద్‌లో సన్‌రైజర్స్-ఢిల్లీ పోరు జరుగుతుంది.
వివరాలు
మరిన్ని మ్యాచ్‌ల తేదీలివే:
ఏప్రిల్ 22న లక్నోలో లక్నో-రాజస్థాన్ మ్యాచ్ నిర్వహిస్తారు. ఏప్రిల్ 23న ముంబైలో ముంబై-చెన్నై మ్యాచ్ జరుగుతుంది. ఏప్రిల్ 24న బెంగళూరులో ఆర్సీబీ-గుజరాత్ మ్యాచ్ ఉంటుంది. ఏప్రిల్ 25న ఢిల్లీలో ఢిల్లీ-పంజాబ్ మ్యాచ్, జైపూర్‌లో రాజస్థాన్-సన్‌రైజర్స్ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ఏప్రిల్ 26న అహ్మదాబాద్‌లో గుజరాత్-చెన్నై మ్యాచ్, లక్నోలో లక్నో-కోల్‌కతా మ్యాచ్ జరుగుతాయి. ఏప్రిల్ 27న ఢిల్లీలో ఢిల్లీ-ఆర్సీబీ మ్యాచ్ ఉంటుంది. ఏప్రిల్ 28న చండీగఢ్‌లో పంజాబ్-రాజస్థాన్ మ్యాచ్ నిర్వహిస్తారు. ఏప్రిల్ 29న ముంబైలో ముంబై-సన్‌రైజర్స్ మ్యాచ్ జరుగుతుంది. ఏప్రిల్ 30న అహ్మదాబాద్‌లో గుజరాత్-ఆర్సీబీ పోరు ఉంటుంది. మే 1న జైపూర్‌లో రాజస్థాన్-ఢిల్లీ మ్యాచ్ జరుగుతుంది. మే 2న చెన్నై-ముంబై మ్యాచ్ నిర్వహిస్తారు. మే 3న హైదరాబాద్‌లో సన్‌రైజర్స్-కోల్‌కతా మ్యాచ్, అహ్మదాబాద్‌లో గుజరాత్-పంజాబ్ మ్యాచ్‌లు జరుగుతాయి.
వివరాలు
మే నెలలో మ్యాచులు ఇలా..
మే 4న ముంబైలో ముంబై-లక్నో మ్యాచ్ ఉంటుంది. మే 5న ఢిల్లీ-చెన్నై మ్యాచ్ నిర్వహిస్తారు. మే 6న హైదరాబాద్‌లో సన్‌రైజర్స్-పంజాబ్ పోరు జరుగుతుంది. మే 7న లక్నోలో లక్నో-ఆర్సీబీ మ్యాచ్ ఉంటుంది. మే 8న ఢిల్లీలో ఢిల్లీ-కోల్‌కతా మ్యాచ్ నిర్వహిస్తారు. మే 9న జైపూర్‌లో రాజస్థాన్-గుజరాత్ మ్యాచ్ జరుగుతుంది. మే 10న చెన్నైలో చెన్నై-లక్నో మ్యాచ్, రాయ్‌పూర్‌లో ఆర్సీబీ-ముంబై మ్యాచ్‌లు జరుగుతాయి. మే 11న ధర్మశాలలో పంజాబ్-ఢిల్లీ మ్యాచ్ నిర్వహిస్తారు. మే 12న అహ్మదాబాద్‌లో గుజరాత్-సన్‌రైజర్స్ మ్యాచ్ జరుగుతుంది. మే 13న రాయ్‌పూర్‌లో ఆర్సీబీ-కోల్‌కతా మ్యాచ్ ఉంటుంది. మే 14న ధర్మశాలలో పంజాబ్-ముంబై మ్యాచ్ నిర్వహిస్తారు. మే 15న లక్నోలో లక్నో-చెన్నై మ్యాచ్ జరుగుతుంది.
వివరాలు
లీగ్ దశ ముగుస్తుందిలా..
మే 16న కోల్‌కతాలో కోల్‌కతా-గుజరాత్ మ్యాచ్ ఉంటుంది. మే 17న ధర్మశాలలో పంజాబ్-ఆర్సీబీ మ్యాచ్, ఢిల్లీలో ఢిల్లీ-రాజస్థాన్ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. మే 18న చెన్నైలో చెన్నై-సన్‌రైజర్స్ మ్యాచ్ జరుగుతుంది. మే 19న జైపూర్‌లో రాజస్థాన్-లక్నో మ్యాచ్ ఉంటుంది. మే 20న కోల్‌కతాలో కోల్‌కతా-ముంబై మ్యాచ్ నిర్వహిస్తారు. మే 21న చెన్నైలో చెన్నై-గుజరాత్ మ్యాచ్ జరుగుతుంది. మే 22న హైదరాబాద్‌లో సన్‌రైజర్స్-ఆర్సీబీ మ్యాచ్ ఉంటుంది. మే 23న లక్నోలో లక్నో-పంజాబ్ మ్యాచ్ నిర్వహిస్తారు. మే 24న ముంబైలో ముంబై-రాజస్థాన్ మ్యాచ్, కోల్‌కతాలో కోల్‌కతా-ఢిల్లీ మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ మ్యాచ్‌లతో లీగ్ దశ ముగుస్తుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
షెడ్యూల్ వివరాలివే:
🚨 IPL 2026 FULL SCHEDULE 🚨 pic.twitter.com/xRrjx7qYhs
— Johns. (@CricCrazyJohns) March 26, 2026