Page Loader
ఇండోర్ పిచ్‌పై ఐసీసీకి బీసీసీఐ అప్పీల్
ఇండోర్ పిచ్‌పై మూడు డీమెరిట్ పాయింట్లను విధించిన ఐసీసీ

ఇండోర్ పిచ్‌పై ఐసీసీకి బీసీసీఐ అప్పీల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 14, 2023
06:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండోర్ స్టేడియానికి ఇచ్చిన పిచ్ రేటింగ్‌పై ఇంటర్నేషన్ క్రికెట్ కౌన్సిల్‌కు బీసీసీఐ అప్పీల్ చేసింది. ఈ క్రమంలో ఐసీసీ పేలవమైన పిచ్‌ అంటూ గతంలో ఈ స్టేడియానికి మూడు డీమెరిట్‌ పాయింట్లను విధించింది. ఈ మ్యాచ్‌లో ఒకే రోజు బౌలర్లు దాదాపు 30 వికెట్లు తీశారు. ఇందులో స్పిన్ బౌలర్లే 26 వికెట్లను తీశారు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇండోర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో పిచ్ పేలవంగా ఉందంటూ మొదటి రోజు నుంచే విమర్శలు వెలువెత్తాయి. మ్యాచ్‌ రిఫరీ బ్రాడ్‌ తన నివేదికలో 'పిచ్‌ చాలా పొడిగా ఉందని, తొలి నుంచి స్పిన్‌ బౌలర్లకు అనుకూలంగా ఉందని పేర్కొన్నారు

పిచ్

పిచ్ రేటింగ్‌కు వ్యతిరేకంగా అప్పీలు

ఏదైనా స్టేడియం ఐదు లేదంటే అంతకంటే ఎక్కువ డీమెరిట్ పాయింట్లను పొందినట్లయితే 12 నెలల పాటు అంతర్జాతీయ మ్యాచ్‌లను నిర్వహించకుండా తాత్కాలికంగా నిలిపివేసే అవకాశం ఉంటుంది. ఐసీసీకి చెందిన ఇద్దరు సభ్యుల ప్యానెల్‌ ఈ విషయంపై సమీక్షించి నిర్ణయం తీసుకోనుంది. 14 రోజుల్లో దీనిపై నివేదిక ఇవ్వనున్నట్లు సదరు అధికారి తెలిపారు. పిచ్‌ రేటింగ్‌కు వ్యతిరేకంగా బోర్డులు అప్పీల్‌ చేయడం ఇదే తొలిసారేమీ కాదు. ఇంగ్లండ్‌-పాక్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ సందర్భంగా రావల్పిండి పిచ్‌కు ఒక డీమెరిట్‌ పాయింట్‌ ఇచ్చింది. దీనిపై పీసీబీ అప్పీల్‌ చేయగా.. ఐసీసీ విచారణ జరిపి డీమెరిట్‌ను తొలగించింది. ఇదే క్రమంలో బీసీసీఐ సైతం ఐసీసీకి అప్పీల్‌ చేసినట్లు సమాచారం.