
IPL 2025: ఉద్రిక్తతల ఎఫెక్ట్.. ఐపీఎల్ 2025 వారం పాటు వాయిదా
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025, 18వ సీజన్ తాత్కాలికంగా వాయిదా పడింది.
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో, ఈ టోర్నీ నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకున్నారు.
టోర్నీ నిర్వాహకులు అధికారికంగా చేసిన ప్రకటనలో, ఐపీఎల్ మ్యాచ్‌లు వారం రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఇప్పటికే భద్రతా కారణాల వల్ల పంజాబ్, ఢిల్లీ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ మధ్యలోనే రద్దయిన విషయం విదితమే.
ఈ రోజు లఖ్‌నవూ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య లఖ్‌నవూలోని ఏకనా క్రికెట్ స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్‌తో సహా నిలిపివేత చర్యలు వెంటనే అమల్లోకి రానున్నాయి.
వివరాలు
ఈ సీజన్‌లో ఇంకా 12 లీగ్ మ్యాచ్‌లు
ప్రస్తుతం ఈ సీజన్‌లో ఇంకా 12 లీగ్ మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. అలాగే, రెండు క్వాలిఫయర్ మ్యాచ్‌లు, ఒక ఎలిమినేటర్, ఒక ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉంది.
షెడ్యూల్ ప్రకారం మే 25న కోల్‌కతాలో ఐపీఎల్ ఫైనల్ జరగనుంది.
ఇక పాయింట్ల పట్టికలో ప్రస్తుతం గుజరాత్, బెంగళూరు జట్లు చెరో 16 పాయింట్లతో అగ్రస్థానాల్లో ఉన్నాయి.
పంజాబ్ జట్టు 15 పాయింట్లు, ముంబయి జట్టు 14 పాయింట్లతో వారిని అనుసరిస్తున్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఐపీఎల్ 2025 వారం పాటు వాయిదా
🚨 News 🚨
— IndianPremierLeague (@IPL) May 9, 2025
The remainder of ongoing #TATAIPL 2025 suspended with immediate effect for one week.