17 మంది మహిళా క్రికెటర్లకు BCCI కాంట్రాక్ట్.. ఏ గ్రేడ్ లో ముగ్గురు
మహిళా క్రికెట్ కోసం బీసీసీఐ ఇప్పటికే డబ్ల్యూపీఎల్, పురుషులతో సమానంగా మ్యాచ్ ఫీజులు అమలు వంటి నిర్ణయాలను తీసుకుంటూ ముందుకెళ్తోంది. తాజాగా సీనియర్ మహిళా క్రికెటర్లకు బీసీసీఐ కాంట్రాక్టులను ప్రకటించింది. ఇందులో టీమిండియా నుంచి 17 మంది మహిళా క్రికెటర్లకు కాంట్రాక్టులు దక్కడం విశేషం. అయా క్రికెటర్లకు సంబంధించి వేతనాలను మాత్రం బీసీసీఐ వెల్లడించకపోవడం గమనార్హం. కేవలం ముగ్గరు ప్లేయర్లకు మాత్రమే బీసీసీఐ ఏ గ్రేడ్ ను ఇచ్చింది. A గ్రేడ్ లో భారత జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, ఆల్ రౌండర్ దీప్తిశర్మ చేరాడు. వీరికి మాత్రమే టాప్ గ్రేడ్ ను కేటాయించడం విశేషం.
మహిళా క్రికెటర్లకు వేతనాలు పెంపు
గతేడాది ప్రకారం రూ.50 లక్షలు వార్షిక వేతనంగా చెల్లించారు. ఈ సారి ఆ మొత్తం పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. B గ్రేడ్ లో రేణుకా ఠాకూర్, జెమీయా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, రీచా ఘోస్, రాజేశ్వరి గైక్వాడ్, C గ్రేడ్ లో మేఘనా సింగ్, దేవికా విద్య, ఎస్. మేఘన, అంజలీ, పూజా వస్త్రాకర్, స్నేహ్ రాణా, రాధా యాదవ్, హర్లీన్ డియోల్, యస్తికా భాటియా చోటు దక్కించుకున్నారు. మహిళల మ్యాచ్ ఫీజులను సమానంగా చెల్లించాలని బీసీసీఐ అంగీకరించినా.. పురుషుల, మహిళలకు వ్యత్యాసం చాలానే ఉండనుంది.