Page Loader
జడేజాకు బంఫరాఫర్ ప్రకటించిన బీసీసీఐ
ఎ ప్లస్ కేటగిరిలో చోటు దక్కించుకున్న రవీంద్ర జడేజా

జడేజాకు బంఫరాఫర్ ప్రకటించిన బీసీసీఐ

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 27, 2023
10:53 am

ఈ వార్తాకథనం ఏంటి

2022-23 సంవత్సరానికి ఆటగాళ్ల వార్షిక ఒప్పందాన్ని బీసీసీఐ ప్రకటించింది. సంజు శాంసన్, కేఎస్ భరత్ ఆటగాళ్లకు తొలిసారిగా ఇందులో ప్రవేశం లభించింది. రహానే, భువనేశ్వర్‌, ఇషాంత్‌తో పాటు మరొ కొంతమంది ఆటగాళ్లను పేర్లను బీసీసీఐ తొలిగించింది. గతేడాది 'ఎ' గ్రేడ్‌లో ఉన్న ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ప్రోమోషన్ సాధించి 'ఎ ప్లస్' గ్రేడ్‌లో చోటు దక్కించుకోవడం విశేషం. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రాలకు ఎ ప్లస్ కేటగిరిలో చోటు లభించింది. 'ఎ ప్లస్' కేటగిరిలో ఉన్న ఆటగాళ్లకు బీసీసీఐ రూ. 7 కోట్లు చెల్లించనుంది.

కేఎల్ రాహుల్

ఎ కేటగిరి నుండి 'బి'కి పడిపోయిన కేఎల్ రాహుల్

ఇటీవల ఫామ్ ను కోల్పోయిన కేఎల్ రాహుల్ ఇప్పటి వరకూ ఎ గ్రేడ్ లో ఉండగా.. ఇప్పుడు 'బి' కి పడిపోయాడు. ఏ కేటగిరిలో ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాతో పాటు రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, రిషబ్ పంత్, అక్షర్ పటేల్ ఉన్నారు. వీరికి రూ. 5 కోట్లు లభించనున్నాయి. 'బి' కేటగిరిలో పుజారా, కేఎల్‌ రాహుల్, శ్రేయస్‌ అయ్యర్, సిరాజ్, సూర్యకుమార్‌ యాదవ్, శుబ్‌మన్‌ గిల్‌ ఉన్నారు. 'సి' కేటగిరిలో ఉమేశ్‌ యాదవ్, శిఖర్‌ ధావన్, శార్దుల్‌ ఠాకూర్, ఇషాన్‌ కిషన్, దీపక్‌ హుడా, యజువేంద్ర చహల్, కుల్దీప్‌ యాదవ్, వాషింగ్టన్‌ సుందర్, సంజూ సామ్సన్, అర్ష్‌దీప్‌ సింగ్, కోన శ్రీకర్‌ భరత్‌ల‌కు స్థానం లభించింది.