LOADING...
BCCI: బీసీసీఐ షాకింగ్ నిర్ణయం.. ఐపీఎల్ 2026 షెడ్యూల్‌లో కీలక మార్పులు.. రెండు జట్ల మ్యాచ్‌లపై ప్రభావం..!
బీసీసీఐ షాకింగ్ నిర్ణయం.. ఐపీఎల్ 2026 షెడ్యూల్‌లో కీలక మార్పులు.. రెండు జట్ల మ్యాచ్‌లపై ప్రభావం..!

BCCI: బీసీసీఐ షాకింగ్ నిర్ణయం.. ఐపీఎల్ 2026 షెడ్యూల్‌లో కీలక మార్పులు.. రెండు జట్ల మ్యాచ్‌లపై ప్రభావం..!

వ్రాసిన వారు Moogati Shabari
Apr 13, 2026
11:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 19వ సీజన్ మధ్యలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అనూహ్యంగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 26న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగాల్సిన గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్యాహ్న మ్యాచ్‌ను ఇప్పుడు చెన్నైలోని ఎం.ఏ. చిదంబరం స్టేడియానికి మార్చింది. అదే విధంగా, మే 21న చెన్నైలో జరగాల్సిన మ్యాచ్‌ను అహ్మదాబాద్‌కు తరలించి, అక్కడ రాత్రి 7:30 గంటలకు నిర్వహించనున్నట్లు నిర్ణయించారు. గుజరాత్ రాష్ట్రంలో ఏప్రిల్ 26న స్థానిక సంస్థల ఎన్నికలు ఉండటంతో ఈ మార్పులు తప్పనిసరి అయ్యాయని బీసీసీఐ స్పష్టం చేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వేదికలు మారడానికి కారణం అదే

వివరాలు

ఎన్నికల ప్రభావం, భద్రతా సమస్యలు..

సాధారణంగా ఐపీఎల్ పూర్తి షెడ్యూల్‌ను ఒకేసారి ప్రకటించడం ఆనవాయితీ. అయితే 2026లో దేశంలోని అనేక రాష్ట్రాల్లో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, షెడ్యూల్‌ను రెండు దశల్లో విడుదల చేశారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో పోలింగ్ తేదీలను పరిగణలోకి తీసుకుని మ్యాచ్‌లను సర్దుబాటు చేశారు. స్టేడియాల వద్ద భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు అవసరం కావడం, అలాగే ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసు బలగాలకు అదనపు ఒత్తిడి పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో కూడా కోల్‌కతా, రాజస్థాన్ జట్ల హోమ్ మ్యాచ్‌ల విషయంలో ఇలాంటి జాగ్రత్తలు పాటించారు.

Advertisement

వివరాలు

చెన్నైకి కలిసొస్తుందా? 

ఈ మార్పుల ప్రభావం రెండు జట్ల ప్రదర్శనపై కూడా కనిపిస్తోంది. శుభ్‌మన్ గిల్ నాయకత్వంలోని గుజరాత్ జట్టు స్థిరమైన ఆటతీరుతో నాలుగు మ్యాచ్‌లలో రెండు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో ఐదవ స్థానంలో నిలిచింది. మరోవైపు, రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా మూడు ఓటములతో సీజన్‌ను నిరుత్సాహకరంగా ప్రారంభించింది. అయితే ఢిల్లీ జట్టుపై సాధించిన విజయంతో తిరిగి గెలుపు దిశగా పయనిస్తోంది. ప్రస్తుతం చెన్నై జట్టు పాయింట్ల పట్టికలో తొమ్మిదవ స్థానంలో కొనసాగుతోంది.

Advertisement