క్రికెట్ ప్రపంచంలో బీసీసీఐనే నెంబర్ వన్.. ఏడాదికి ఐసీసీ నుంచే 1900 కోట్ల ఆదాయం
క్రికెట్ ప్రపంచంలో బీసీసీఐ మరోసారి కాసుల వర్షం కురిపించింది. ఐసీసీ కొత్త రెవెన్యూ షేరింగ్ మోడల్ లో బిసీసీఐ కింగ్ మేకర్ గా నిలిచింది. ఈ విషయాన్నిక్రిక్ ఇన్ఫో రిపోర్టు వెల్లడించింది. వచ్చే నాలుగేళ్లకు గాను ఐసీసీకి వచ్చే ఆదాయంలో సుమారు 40శాతం బిసీసీఐ ఖాతాల్లోకి వెళ్లనుంది. ప్రస్తుతం ఈ కొత్త ఆదాయ పంపిణీ విధానం ప్రతిపాదన దశలో ఉంది. 2024-27 మధ్య ఐసీసీకి మొత్తం రూ.4922 కోట్లు ఆదాయం వస్తోంది. అందులో బీసీసీఐ వాటా సూమారు రూ.1884 కోట్లు.. ఐసీసీ మొత్తం ఆదాయంలో 38.5శాతం ఇండియన్ క్రికెట్ బోర్డు ఖాతాలోకి వెళ్లనుంది. గతంలో ఐసీసీ ఆదాయంలో మెజార్టీ వాటా మూడు బోర్డులకు వెళ్లేది.
మూడోస్థానంలో నిలిచిన క్రికెట్ ఆస్ట్రేలియా
ఈ కొత్త మోడల్ ప్రకారం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుకు 6.89 శాతం దక్కనుంది. మన బీసీసీఐతో పొలిస్తే ఇది చాలా తక్కువ. మూడో స్థానంలో క్రికెట్ ఆస్ట్రేలియా నిలిచింది. ఆ బోర్డుకు కూడా 3.75 కోట్ల డాలర్లు దక్కే అవకాశం ఉంది. రూ.3.45 కోట్ల డాలర్లతో పాకిస్థాన్ నాలుగో స్థానంలో నిలిచింది. మిగతా 8 సభ్య దేశాల్లో ఒక్కొక్కరికి ఐసీసీ ఆదాయంలో ఐదుశాతం కంటే తక్కువే దక్కుతుంది. అయితే నాలుగు రకాల అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ కొత్త రెవెన్యూ మోడల్ ను తయారు చేశారు.