Page Loader
BCCI: బీసీసీఐ నూతన నిబంధనలు.. ఆటగాళ్ల కోసం ఒకే బస్సు!
బీసీసీఐ నూతన నిబంధనలు.. ఆటగాళ్ల కోసం ఒకే బస్సు!

BCCI: బీసీసీఐ నూతన నిబంధనలు.. ఆటగాళ్ల కోసం ఒకే బస్సు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 20, 2025
11:33 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత క్రికెట్‌ వ్యవస్థలో మార్పులు చేర్పులు తీసుకురావడంలో బీసీసీఐ తాజాగా 10 పాయింట్లతో కూడిన నియమావళిని రూపొందించింది. ఈ నియమాలు అధికారికంగా ప్రకటించకపోయినా వాటిని అమలు చేయడం మొదలుపెట్టినట్లు సమాచారం అందింది. ముఖ్యంగా, బీసీసీఐ జట్టు ఆటగాళ్ల ప్రయాణాలపై కొత్త ఆంక్షలను విధించింది. నూతన నియమాలు ప్రకారం ప్లేయర్లు ఒకే బస్సులో ప్రయాణించాల్సిన అవసరం ఉంటుంది. ఆటగాళ్లకు వ్యక్తిగత వాహనాలను అనుమతించకూడదు.

Details

ప్రాక్టీస్ పూర్తయ్యే వరకూ మైదానంలోనే ఉండాలి

ప్రాక్టీస్ సెషన్‌ పూర్తయ్యే వరకు ఆటగాళ్లు మైదానంలోనే ఉండాలి. అక్కడి నుండి హోటల్‌‌కు కూడా కలిసే వెళ్లాలని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ నియమాలు ఇప్పటికే బెంగాల్‌ క్రికెట్‌ సంఘం (క్యాబ్‌) ద్వారా అమలు చేశారు. ఈ నెల 20వ తేదీన జరిగిన తొలి టీ20 మ్యాచ్‌ కోసం, భారత్‌, ఇంగ్లాండ్‌ జట్లు కోల్‌కతాలో చేరాక, వారు ఒకే బస్సులో ప్రయాణించారన్నది సమాచారం. బెంగాల్‌ క్యాబ్‌ అధ్యక్షుడు స్నేహాశీష్‌ గంగూలీ ఈ విషయాన్ని నిర్ధారించారు. భారత జట్టుకు ఒకే బస్సు అందుబాటులో ఉంచామని, ఎవరికి కూడా వ్యక్తిగత వాహనాలు ఇవ్వలేదని తెలిపారు.