LOADING...
BCCI : సెప్టెంబర్ చివరి వారంలో బీసీసీఐ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు
సెప్టెంబర్ చివరి వారంలో బీసీసీఐ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు

BCCI : సెప్టెంబర్ చివరి వారంలో బీసీసీఐ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 06, 2025
05:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవడానికి సన్నాహకాలు పూర్తయినట్లు తెలుస్తోంది. వార్షిక సమావేశం రోజైన సెప్టెంబర్ 28న ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో ఉదయం 11:30 గంటలకు సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఎన్నికల ప్రక్రియపై చర్చ జరుగుతుంది. అంతేకాక సెప్టెంబర్ రెండో వారంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయబోవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగుతున్న రాజర్ బిన్ని 70 ఏళ్ల వయసు దాటడంతో బాధ్యతల నుంచి తప్పుకున్నారు.

Details

మధ్యంతర అధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా

ప్రస్తుతం కార్యదర్శిగా ఉన్న రాజీవ్ శుక్లా మధ్యంతర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఇదే సమయంలో బోర్డులోని సభ్యుల పదవీకాలం ముగియడం వల్ల సెప్టెంబర్ 18న ఎన్నికలు జరుపేందుకు బీసీసీఐ తీర్మానించింది. ఈ ఎన్నికల్లో అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి స్థానాల కోసం పోలింగ్ జరుగనుంది. ఈ సమావేశంలో అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు, ఐపీఎల్, డబ్ల్యూపీఎల్ నిర్వహణ కోసం నిర్ణయాలు తీసుకోవడం కూడా చర్చలో ఉంటుందని తెలుస్తోంది. ఈ కౌన్సిల్‌లో బీసీసీఐ సాధారణ కార్యవర్గ సభ్యుడు ఒకరు, భారత క్రికెట్ అసోసియేషన్ నుంచి ఇద్దరు సభ్యులు ఉంటారని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.