Gautam Gambhir: 2027 వన్డే వరల్డ్ కప్ వరకు హెడ్ కోచ్‌గా గంభీర్ కొనసాగింపు?
ఈ వార్తాకథనం ఏంటి
భారత క్రికెట్ జట్టు వరుస పరాజయాలతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మాత్రం ఆయనకు మద్దతుగా నిలిచే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టెస్ట్ క్రికెట్‌లో చోటుచేసుకుంటున్న వేగవంతమైన మార్పులతో పాటు కీలక ఆటగాళ్ల గాయాల సమస్యలను పరిగణనలోకి తీసుకున్న బోర్డు.. ప్రస్తుతానికి గంభీర్‌పై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోకూడదని భావిస్తున్నట్లు సమాచారం.
వివరాలు
తప్పించకపోవడానికి ప్రధానంగా రెండు కారణాలు..
తాజా నివేదిక ప్రకారం.. గంభీర్‌ను హెడ్ కోచ్ పదవి నుంచి తప్పించకపోవడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది.
రెడ్ బాల్ క్రికెట్‌లో టీమిండియా ప్రస్తుతం కీలకమైన మార్పుల దశలో ఉందని బీసీసీఐ అంగీకరిస్తోంది.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ వంటి దిగ్గజ ఆటగాళ్లు టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలకడంతో.. కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో యువ జట్టు రూపుదిద్దుకుంటోంది.
ఇలాంటి సమయంలో కోచ్‌ను మార్చడం సరైన నిర్ణయం కాదని బోర్డు భావిస్తున్నట్లు సమాచారం.
వివరాలు
గంభీర్‌కు మరికొంత సమయం..
ప్రస్తుతం శుభ్‌మన్ గిల్ సారథ్యంలో టీమిండియా కొత్త తరంగా రూపుదిద్దుకుంటోందని బీసీసీఐ భావిస్తోంది.
ఈ క్రమంలో జట్టుకు స్థిరమైన ఫలితాలు సాధించేందుకు గంభీర్‌కు మరికొంత సమయం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఈ పరిణామాల నేపథ్యంలో.. 2027 వన్డే ప్రపంచకప్ ముగిసే వరకు గౌతమ్ గంభీర్ భారత జట్టు హెడ్ కోచ్‌గా కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.