Page Loader
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్-2 కి బీసీసీఐ సరికొత్త ప్లాన్
మొదటి సీజన్ ఐపీఎల్ విజేతగా ముంబై ఇండియన్స్

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్-2 కి బీసీసీఐ సరికొత్త ప్లాన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 05, 2023
04:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మొదటి సీజన్ సూపర్ హిట్ అయింది. దీంతో టోర్నమెంట్ పరిధిని విస్తరించేందుకు బీసీసీఐ నూతన ప్రణాళికలను రచిస్తోంది. ఈ టోర్నమెంట్‌ను దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న క్రికెట్ అభిమానులకు చేరవేయడానికి సొంత మైదానాల్లో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ చేపట్టాలని బీసీసీఐ ఆలోచిస్తోంది. మొదటి సీజన్‌ను ముంబైలోని రెండు స్టేడియంలో మాత్రమే నిర్వహించారు. ఈసారి అలా కాకుండా దేశంలోని అన్ని స్టేడియాల్లో మ్యాచ్‌లు జరిగేలా ప్లాన్ చేయాలని బీసీసీఐ డిసైడ్ చేసినట్లు సమాచారం. గత సీజన్ మాదిరిగానే ఐదు జట్లు మాత్రమే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఆడతాయని, వచ్చే మూడేళ్ల వరకు వాటి సంఖ్య పెంచమని, మూడేళ్ల తర్వాత పెంచే అవకాశం ఉంటుందని బీసీసీఐ అధికారి ఒకరు స్పష్టం చేశారు.

ఐపీఎల్

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌కు అద్భుత ఆదరణ

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఎన్నో సవాళ్లతో కూడుకున్నప్పటికీ దానిని విజయవంతంగా పూర్తి చేశారని, తమకు ఎదురైన కష్టమైన ప్రాజెక్టులో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఒకటని, కానీ అందరి ఆదరణ చూశాక, తాము అభిప్రాయాన్ని మార్చుకున్నామని ధమాల్ స్పష్టం చేశారు. మొదటి సీజన్ విజయవంతం కావడంతో తదుపరి సీజన్‌లో ఎక్కువ మంది మహిళా క్రికెటర్లు అవకాశం కల్పించేలా ప్రణాళికలు చేపడుతామని తెలిపారు.