Page Loader
WPL: ఫైనల్‌లో ఢిల్లీ, ముంబై ఇండియన్స్.. గెలుపు ఎవరిదో..!
ఫైనల్లో ఢిల్లీని ఢీకొట్టనున్న ముంబాయి ఇండియన్స్

WPL: ఫైనల్‌లో ఢిల్లీ, ముంబై ఇండియన్స్.. గెలుపు ఎవరిదో..!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 25, 2023
03:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉమెన్స్ ప్రీమిమర్ లీగ్‌లో చివరి దశకు చేరుకుంది. తొలి కప్పును ఎలాగైనా కైవసం చేసుకొని చరిత్ర సృష్టించాలని ఢిల్లీ, ముంబై జట్లు భావిస్తున్నాయి. రెండు జట్లు నువ్వా - నేనా అన్నట్లు ఈ సీజన్లో పోటీపడ్డాయి. లీగ్ దశలో రెండూ సమానంగా మ్యాచ్‌లు గెలిచాయి. అయితే కొద్దిగా రన్‌రేట్ మెరుగ్గా ఉండటంతో ఢిల్లీ ఫైనల్‌కు చేరుకుంది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండనుంది. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లు రాణించే అవకాశం ఉంటుంది. ఫైనల్ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు స్పోర్ట్స్ 18లో ప్రసారం కానుంది. రెండు జట్లు బౌలింగ్, బ్యాటింగ్ విభాగంలో సమవుజ్జీవులుగా ఉండటంతో మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగే అవకాశం ఉంటుంది.

ముంబాయి ఇండియన్స్

ఇరు జట్లలోని సభ్యులు

మొదటి లీగ్‌ మ్యాచులో దిల్లీని 105కు ఆలౌట్‌ చేసిన ముంబయి 15 ఓవర్లకే 8 వికెట్ల తేడాతో గెలిచింది. రెండో లీగులో ముంబయిని 109కి పరిమితం చేసిన దిల్లీ 9 ఓవర్లకే మ్యాచ్‌ను ముగించి ముంబైపై కసి తీర్చుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాబబుల్ ఎలెవన్: మెగ్ లానింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, అలిస్ క్యాప్సీ, రోడ్రిగ్స్, మారిజానే కాప్, తానియా భాటియా (వికెట్-కీపర్), జెస్ జొనాసెన్, రాధా యాదవ్, అరుంధతి‌రెడ్డి, శిఖా పాండే, పూనమ్ యాదవ్ XI ఇండియన్స్: ప్రో. హేలీ మాథ్యూస్, యాస్తికా భాటియా (వికెట్-కీపర్), నాట్ స్కివర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), మెలీ కెర్, వస్త్రాకర్, ఇస్సీ వాంగ్, అమంజోత్ కౌర్, హుమైరా కాజీ, జింటిమణి కలితా, సైకా ఇషాక్