Page Loader
యోయో ఫిట్‌నెస్ మళ్లీ వచ్చేసింది..!
భారత్ ఆటగాళ్లు

యోయో ఫిట్‌నెస్ మళ్లీ వచ్చేసింది..!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 02, 2023
12:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఒకప్పుడు టీమ్ ఇండియా ఎంపికకు తప్పనిసరిగా యోయో ఫిట్ నెస్ పరీక్ష ఉండేది. యోయో ఫిట్‌నెస్ పరీక్ష మళ్లీ వచ్చేసింది. ప్రస్తుతం బీసీసీఐ సెలక్షన్ అర్హత ప్రమాణాల జాబితాలో నిర్ణయించాలని ధ్రువీకరించింది. ఈ ఏడాది వన్డే ప్రపంచ కప్ కోసం 20 మందితో కోర్ గ్రూప్ ఏర్పాటు చేసి, అందులోని ఆటగాళ్లను టోర్ని ముందు వరకు రోటెట్ చేయాలనుకుంది. ప్రపంచ కప్ లో ఓటమి సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత్ క్రికెట్ జట్టులో చోటు దక్కాలంటే ఆటగాళ్లు మళ్లీ యోయో ఫిటెనెస్ పరీక్షల్లో పాసవ్వాల్సిందే. బోర్డు కార్యదర్శి జైషా, అధ్యక్ష్యుడు బిన్నీ, కెప్టెన్ రోహిత్, కోచ్ రాహుల్, ఎన్సీఏ అధిపతి లక్ష్మణ్, సెలక్టర్ చేతన శర్మ సమక్షంలో సమావేశం జరిగింది.

టీమిండియా

మరోసారి చేతన్ కు చైర్మన్‌ అవకాశం..!

యోయో పరీక్షతో పాటు డెక్సా కూడా తప్పనిసరిగా చేశారు. యోయో పరీక్షల్లో ఆటగాళ్లు 20 మీటర్లు దూరంలో ఉన్న యార్కర్ల మధ్య పరిగెత్తాల్సి ఉంటుంది. విరాట్ కోహ్లీ ఉన్నప్పుడు ఈ యోయో పరీక్షను ప్రవేశపెట్టారు. మొదట్లో పాస్ స్కోరును 16.5 గా నిర్ణయించారు. ఇప్పుడు దాన్ని 16.1 కి తగ్గించారు. ఇటీవల ఫిట్ నెస్ ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. జాతీయ సెలక్షన్ అర్హత సాధించాలంటే వారు దేశవాలీ సీజన్లో తగినంత క్రికెట్ ఆడాలనే నిబంధన తేనున్నారు. యోయో టెస్టు, డెక్సా ఇప్పుడు అర్హత ప్రమాణాల్లో భాగం. చేతన్‌కు మరోసారి ఛైర్మన్‌ పదవి దక్కే అవకాశముంది. ఛైర్మన్‌గా కాకపోయినా నార్త్‌జోన్‌ నుంచి సెలక్టర్‌గానైనా అతడు కమిటీలో ఉండే అవకాశముంది.