IPL 2023: దంచికొట్టిన చైన్నై బ్యాటర్లు.. కోల్‌కతా ముందు భారీ స్కోరు
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 16వ సీజన్ లో భాగంగా కోల్ కతా నైట్ రైడర్స్, చైన్నైసూపర్ కింగ్స్ మధ్య ఈడెన్ గార్డెన్స్ లో మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన కోల్ కతా మొదట బౌలింగ్ ఎంచుకుంది.
మొదటగా చైన్నై ఓపెనర్లు కాన్వే, రుతురాజ్ గైక్వాడ్ జట్టుకు శుభారంభాన్ని అందించారు. వీరిద్దరూ తొలి వికెట్ కు 73 పరుగులు జోడించారు.
తర్వాత రుతురాజ్ గైక్వాడ్ (35) సుయూష్ శర్మ బౌలింగ్ లో ఔట్ అయ్యారు. తర్వాత క్రీజులో దిగిన అంజిక్య రహానే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.
మొదటగా కాన్వే(56) బౌండరీల వర్షం కురిపించగా.. తర్వాత అంజిక్య రహానే కోలకతా బౌలర్లకు చుక్కలు చూపించారు. కాన్వే ఓటైన తర్వాత శివం దూబే క్రీజులోకి దిగి వేగంగా పరుగులను రాబట్టాడు.
Details
కోల్ కతా బౌలర్లకు చుక్కలు చూపించిన రహానే, దూబే
రహానే, దూబే పోటాపోటీగా ఈడెన్ గార్డన్స్ లో బౌండరీలతో విరుచుకుపడ్డారు. రహానే 29 బంతుల్లో (5 సిక్సర్లు, 6 ఫోర్లు), దూబే 21 బంతుల్లో (5 సిక్సర్లు, 2 ఫోర్లు) 50 పరుగులు చేయడంతో చైన్నై భారీ స్కోరును చేసింది.
చివర్లో జడేజా 8 బంతుల్లో 18 పరుగులు చేశాడు. దీంతో చైన్నై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది.
కోల్ కతా బౌలర్లలో కోల్వంత్ ఖేజ్రోలియా రెండు వికెట్లు, వరుణ్ చక్రవర్తి, సుయేష్ శర్మ తలా ఓ వికెట్ సాధించారు.